Begin typing your search above and press return to search.

అడ‌ల్ట్ వేషాల‌తో ఐపు లేకుండా పోతారు

By:  Tupaki Desk   |   4 Aug 2020 4:30 AM GMT
అడ‌ల్ట్ వేషాల‌తో ఐపు లేకుండా పోతారు
X
అడ‌ల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల‌కు సంత‌కాలు చేసిన క‌థానాయిక‌లు ఎవ‌రూ లాంగ్ ర‌న్ లో నిల‌దొక్కుకోలేదు. టాలీవుడ్ కి ఎంద‌రో అంద‌గ‌త్తెలు వ‌చ్చారు వెళ్లారు. ఇప్ప‌టికీ అలా డీగ్రేడ్ సినిమాలు చేసి ఆ త‌ర్వాత కెరీర్ ని కోల్పోయిన భామ‌ల‌కు కొద‌వేమీ లేదు. త‌మ త‌ప్పును తెలుసుకుని స‌రిదిద్దుకునే లోపే డ్యామేజ్ జ‌రిగిపోయింది. అవ్వాల్సినంతా అయిపోయింది. ఇటీవ‌ల ఈ కేట‌గిరీకే చెందిన నాయిక‌గా ఆర్.ఎక్స్ 100 ఫేం పాయ‌ల్ రాజ్ పుత్ ని ఉద‌హ‌రిస్తున్నారు.

తొలి ప్ర‌య‌త్న‌మే త‌న‌దైన ఈజ్ గ్లామ‌ర్ తో దుమ్ము దులిపేసిన పాయ‌ల్ ఆ త‌ర్వాత మ‌రింత‌గా దిగ‌జారి న‌టించిన ఆర్.డి.ఎక్స్ కెరీర్ కే ముప్పు తెచ్చింది. విప‌రీత‌మైన ఎక్స్ పోజింగ్ .. డీగ్రేడ్ కంటెంట్ తో ముప్పు ఎలా ఉంటుందో గ్ర‌హించే లోపే స్టార్ హీరో‌లు ఆఫ‌ర్లు ఇచ్చేందుకే భ‌య‌ప‌డ్డారు. ఫ్యామిలీ హీరోయిన్ కాదు! అన్న ముద్ర క‌థానాయిక‌లకు మ‌రీ అంత మంచిది కాద‌నే అభిప్రాయం ఉంది. ఇక ర‌కుల్ ప్రీత్ టాలీవుడ్ అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న న‌టించి చివ‌రికి ఫేడ‌వుట్ అయిపోవ‌డానికి కార‌ణం ఏమిటో తెలిసిందే.

తాజాగా టాలీవుడ్ లో కొత్త నీరు ప్ర‌వ‌హిస్తోంది. రుహానీ శ‌ర్మ‌.. సిమ్ర‌త్ కౌర్ లాంటి టాప్ మోడ‌ల్స్ కం న‌టీమ‌ణులు తొలి ప్ర‌య‌త్న‌మే దుమారం రేపుతున్నారు. అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం అడ్డు చెప్ప‌క ప‌ట్టు విడుపు తెలిసిన‌ ఈ భామ‌లిద్ద‌రూ `డ‌ర్టీ హ‌రి` చిత్రంలో న‌టించారు. ఇందులో రుహానీ చెల‌రేగిపోయిన తీరు యూత్ లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. రుహానీ అంత‌గా ఆద‌ర‌ణ పొంద‌ని ప‌రిచ‌యం అనే చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది. తాజాగా డ‌ర్టీ హ‌రి చిత్రంతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ప్ర‌స్తుతం డ‌ర్టీ బ్యూటీస్ రుహానీ.. సిమ్ర‌త్ ల‌కు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయిట‌. కానీ ఇలా వ‌చ్చిన అవ‌కాశాల్ని లాంగ్ ర‌న్ కోసం ఏమేర‌కు సద్వినియోగం చేయ‌గ‌ల‌రు? అన్న‌దే అస‌లు పాయింట్.

ఇక ఈ భామ‌లు శ్రీ‌య లాగానో లేక స‌మంత త‌ర‌హానో సుదీర్ఘ ఇన్నింగ్స్ ని సాగించాలంటే కేవ‌లం గ్లామ‌ర్ ని నిమ్ముకుంటే స‌రిపోదు. అందాల ఆర‌బోత కొంత‌వ‌ర‌కే. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్ని ఎంచుకుని సాయి ప‌ల్ల‌వి లా ప్ర‌తిభ‌ను చూపిస్తేనే దూసుకెళ్లే వీలుంటుంది. లేదంటే ర‌కుల్ .. పాయ‌ల్ లా ఫేడ‌వుట్ అయిపోవ‌డం ఖాయం అన్న విశ్లేష‌ణ సాగుతోంది.