Begin typing your search above and press return to search.

ఇప్పటికైనా ఆ బ్యూటీ ఫేట్ మారేనా...?

By:  Tupaki Desk   |   18 Jun 2020 2:30 AM GMT
ఇప్పటికైనా ఆ బ్యూటీ ఫేట్ మారేనా...?
X
'Rx 100' హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్యపై స్పందించింది. పాయ‌ల్ చెప్పిన మాట‌ల ప్ర‌కారం బాలీవుడ్ లో నెపోటిజం ఉంద‌ని.. త‌న‌ను ఎంద‌రో బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాద‌ని.. బాలీవుడ్ లో తాను రాణించ‌డం క‌ష్టమని వేరే వారికి ఆఫర్స్ ఇచ్చారని తెలిసింది. అంతేకాకుండా సినిమాల్లో రాణించాలనే పట్టుదల త‌న‌ను టాలీవుడ్ వైపు అడుగుల ప‌డేలా చేసింద‌ని.. అవ‌కాశాలు వ‌చ్చినా రాకపోయినా మ‌న‌స్సుని స్ట్రాంగ్ గా ఉంచుకొని ముందుకు సాగాలే త‌ప్ప ఆత్మ‌హ‌త్య సొల్యూష‌న్ కాద‌ని పాయ‌ల్ రాజ్ పుత్ ట్వీట్ చేసింది. బుల్లితెరపై తన హవా చూపించిన పాయల్ బాలీవుడ్ లో 'వీరే కీ వెడ్డింగ్' అనే సినిమాలో నటించింది. ఇది ప‌క్క‌న‌పెడితే ఈ బ్యూటీ చేతిలో ప్ర‌స్తుతం తెలుగులో జ‌యంత్ సి ప‌రాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నరేంద్ర' సినిమా మాత్రమే ఉంది. ఈ సినిమాలో పాయ‌ల్ పైలెట్ గా న‌టిస్తోందట. షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి ఆహ్వానాలు వస్తున్నా సినిమా ఆఫర్స్ మాత్రం పాయ‌ల్ కి రావడం లేదట. టాలీవుడ్ కి 'Rx 100' చిత్రంతో పరిచయమై కుర్రకారుని తనవైపు తిప్పేసుకున్న పాయల్ రాజ్ పుత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఈ చిత్ర విజయంతో ఎక్కడికో వెళ్ళుపోతుందనుకున్న పాయల్ కు నిరాశే ఎదురైంది.

క్రేజీ ఆఫర్స్ వస్తాయనుకున్న పాయల్ కు 'RDX 100' లాంటి చిన్న చిత్రాలలో నటించే అవకాశం మాత్రమే దక్కింది. 'RDX 100' సినిమాలో 'Rx 100' ని మించి అందాలను ఆరబోసినప్పటికీ స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం మాత్రం దక్కించుకోలేకపోయింది. అలాంటి సమయంలోనే 'వెంకీ మామ' సినిమాలో వెంకటేష్ కి జోడీగా కనిపించి అలరించింది. సినిమా హిట్ అయినా పాయల్ కి మాత్రం అవకాశాలు తగ్గించింది. ఇక 'సీత' సినిమాలో ఐటెం సాంగ్ కి స్టెప్పులేసింది. ఆ తర్వాత రవితేజ సరసన 'డిస్కోరాజా' సినిమాలో నటించినప్పటికీ పరాజయం పలకరించింది. దీంతో అమ్మడికి టాలీవుడ్ లో ఛాన్సెస్ తగ్గిపోయాయి. అయితే 'ఎన్టీఆర్ - కథానాయకుడు' 'వెంకీమామ' చిత్రాల్లో సీనియర్ హీరోల సరసన నటించిన పాయల్ కి సీనియ‌ర్ హీరోలు అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ ఉందని సినీ జనాలు అంటున్నారు. అయితే ఇప్పుడు అమ్మడు కోలీవుడ్ పై ఆశలు పెట్టుకుంది. తమిళ్ లో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటిస్తున్న హారర్ థ్రిల్లర్ 'ఏంజెల్' అనే సినిమాలో పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే పాయల్ కోలీవుడ్ లో పాగా వేసే అవకాశం ఉంది. మిగతా ఇండస్ట్రీలలో పాయల్ ఫేట్ ఎలా ఉన్నా త‌న సొంత భాష పంజాబీలో మాత్రం ఈ బ్యూటీకి వ‌రుస పెట్టి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయట. ఏదేమైనా ఇప్పటి నుంచి ఈ బ్యూటీ ఫేట్ మారుతుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.