కన్నడపైనే పాయల్ చివరి హోప్స్!

Sat Dec 04 2021 08:00:01 GMT+0530 (IST)

Payal Rajput At the end of the career

తెలుగు సినిమా RX 100లో అద్భుత నటన కనబరిచిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కన్నడలో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ధనంజయ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జయరాజ్ బయోపిక్ `హెడ్ బుష్`లో పాయల్ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. పాయల్ మాట్లాడుతూ.. ధనంజయ సర్ తో కలిసి నటించే ఆఫర్ వచ్చినప్పుడు నేను రెండవ ఆలోచన లేకుండా ఎస్ అని చెప్పాను. ఇందులో క్యాబరే డ్యాన్సర్ గా నటిస్తున్నాను. ఆమె పంజాబీ కూడా. కన్నడ భాషపై నాకు అవగాహన లేనందున కన్నడకు న్యాయం చేయడం గురించి నేను భయపడుతున్నానని వారితో చెప్పాను. ఈ పాత్ర హిందీతో కలిపి హాఫ్ నాలెజ్ కన్నడం మాట్లాడుతుందని వారు నాతో చెప్పారు. కాబట్టి సౌకర్యవంతమైన అరంగేట్రం కోసం ఇది మరింత మంచిదని నేను భావించాను.. అని తెలిపారు.హెడ్ బుష్ తారాగణంలో భాగమని ప్రకటించినప్పటి నుండి పాయల్ వాట్సాప్ శాండల్ వుడ్ నుంచి వెల్ కమ్ మెసేజ్ లతో నిండిపోయిందట.  ఇది బయోపిక్.. పైగా పాన్ ఇండియన్ ఫిల్మ్ గా రూపొందుతోంది. తాజా ఆఫర్ తనకు థ్రిల్ ను కలిగిస్తోందని పాయల్ ఆనందం వ్యక్తం చేస్తోంది. నేను ప్రతి చిత్రానికి నా హోమ్ వర్క్ చేసాను. ఇది నిజ జీవితంపై ఆధారపడిన కథ కాబట్టి నా పాత్రను అర్థం చేసుకోవడానికి చాలా కసరత్తుచేశానని పాయల్ ఇంతకుముందే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

పాయల్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. 2018కి ముందు నేను ముంబైలో పోరాడేదానిని.. అవసరాలకు డబ్బు లేక చాలా కష్టంగా ఉండేది. ఆర్.ఎక్స్ 100 నా విధిని ఇలా మలుపు తిప్పుతుందని నాకు తెలియదు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు.. అని కూడా పాయల్ తెలిపింది.

అయితే తెలుగులో అందివచ్చిన అవకాశాల్ని పాయల్ అంత తెలివిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది. దురదృష్టం తనని వెంటాడింది. అందుకే ఇప్పుడు ఇరుగుపొరుగు వైపు చూస్తోంది. ముఖ్యంగా కన్నడలో హెడ్ బుష్ బయోపిక్ పై చాలా హోప్స్ పెట్టుకున్నట్టే కనిపిస్తోంది. అరెరె పాయల్ కెరీర్ ఎండింగ్ కి వచ్చేసినట్లే ఎలాంటి ఆఫర్లు రావడం లేదు అన్న టాక్ ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో వినిపించింది. ప్రస్తుతం ఈ భామ ఫోకస్ కన్నడం వైపుకి తిరిగింది. అక్కడ విజయం దక్కితే మరిన్ని అవకాశాలొస్తాయి. ఆరంగేట్రమే క్రేజీ పాన్ ఇండియా ఫిలింలో ఆఫర్ దక్కించుకుంది కాబట్టి కాస్త వేచి చూడాలి. నిజానికి కన్నడలో నటించడం అంటే తెలుగు-తమిళంలో ఆఫర్లు లేకపోతేనే అనే ఒక అభిప్రాయం ఉంది. అది పాయల్ కి ఒక రకంగా మైనస్ అవుతుందేమో!