రాజమౌళి సార్ ఆర్ఆర్ఆర్ ఓటిటిలో రిలీజ్ చేయొద్దు అంటున్న ఎన్టీఆర్ హీరోయిన్

Tue Jul 07 2020 07:00:03 GMT+0530 (IST)

Payal Gosh on RRR Movie

పదేళ్ల క్రితం 'ప్రయాణం' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ పాయల్ ఘోష్. అతి కొద్దికాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైంది. 20ఏళ్లకే సినిమాల్లోకి వచ్చిన పాయల్ రీసెంట్ గా 'కోయి జానేనా' సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించింది. అంతకుముందు తెలుగులో అడపా దడపా చిన్న చిన్న పాత్రలలో కనిపించినా పాయల్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంత జరిగితే అంత చేసి ప్రచారం చేస్తారు అంటోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ పుకారు నమ్మి బుక్ అయింది పాయల్. ఈ సందర్భంగా ట్విట్టర్లో.. ఆర్ఆర్ఆర్ సినిమా పై ఓ వెబ్ సైట్ తప్పుడు కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ఓటిటి యాప్‌లో విడుదల చేస్తారని.. టికెట్ ధర 500 రూపాయలుగా ఫిక్స్ చేస్తాడని ఆ రూమర్స్ చదివిందట.8 భాషల్లో ఓటిటి రిలీజ్ చేస్తే రాజమౌళి అకౌంట్‌లో ఐదు గంటల్లోనే రూ. 1200 కోట్లు పడతాయని చెప్పుకొచ్చింది సదరు వెబ్ సైట్. అయితే వీటిని పాయల్ ఘోష్ గుడ్డిగా నమ్మింది. వెంటనే స్పందించిన పాయల్.. ట్విట్టర్లో ఏకంగా రాజమౌళికే రిక్వెస్ట్ పంపింది. అయితే అందులోనే రాజమౌళి ట్విట్టర్ అకౌంట్‌ను తప్పుగా మెన్షన్ చేసింది ఈ బ్యూటీ. ఆర్ఆర్ఆర్ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూస్తేనే దాన్ని ఫీల్ అవుతామని.. దయచేసి ఓటీటీలో రిలీజ్ చేయొద్దని రాజమౌళిని వేడుకుంది. రాజమౌళి నేమ్ తప్పుగా మెన్షన్ చేయడంతో పాయల్ ట్వీట్ పై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. పాయల్ అమాయకత్వానికి కొందరు నవ్వి వదిలేస్తే.. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రిటీలు మీరే ఇలాంటి రూమర్లను ఎలా నమ్ముతారు.. ఎలా ట్వీట్ చేస్తారని ఫైర్ అవుతున్నారు. దెబ్బకు పాయల్ స్పందించి.. ఆ వార్త ఎక్కడ చూసిందో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడు లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటోంది.