నాపై యాసిడ్ దాడి ప్లాన్ చేశారని నటి సంచలన ఆరోపణ

Tue Sep 21 2021 21:23:47 GMT+0530 (IST)

Payal Ghosh alleges attack by masked men develops injuries

బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ సంచలన ఆరోపణలు చేసింది. గతంలో సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసిన హీరోయిన్ పాయల్ ఘోష్ పై తాజాగా యాసిడ్ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చిన కొందరు తనపై యాసిడ్ ఇనుపరాడ్లతో దాడి చేసినట్లుగా పాయల్ సంచలన ఆరోపణలు చేసింది.ముంబైలోని ఓ మెడికల్ షాపులో మందులు తీసుకొని కారులో కూర్చుంటున్న సమయంలో తనపై దాడి చేశారని పాయల్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను చెబుతూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో పాయల్ మాట్లాడుతూ.. 'మెడిసిన్స్ తెచ్చుకోవడానికి నిన్న బయటకు వెళ్లాను. ఆ తర్వాత నా కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుండగా.. కొందరు నాపై దాడికి ప్రయత్నించారు. వారి చేతిలో గ్లాస్ బాటిల్ కూడా ఉంది. అందులో యాసిడ్ ఉన్నట్లు తెలుస్తోంది. నన్ను ఇనుపరాడ్లతో కొట్టేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాను.గట్టిగా కేకలు వేశాను. దీంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారని పాయల్ పేర్కొంది.

ఆ సమయంలో వారు తీసుకువచ్చిన ఇనుప రాడ్డు నా ఎడమ చేతికి తగిలి గాయాన్ని పాయల్ వీడియోలో చూపించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను.. నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటిది జరగలేదు. ముంబైలో తొలిసారి ఈ పరిస్థితిని ఎదుర్కొన్నానని పాయల్ తెలిపింది.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి కంగారుగా ఉందని.. నొప్ప వల్ల రాత్రంతా నిద్రపోలేదని పాయల్ చెప్ుకొచ్చింది. ఈ దాడి ఎవరో తెలిసిన వాళ్లే ప్లాన్ ప్రకారం చేశారని అనుమానం వ్యక్తం చేసింది పాయల్.

తెలుగులో 'ప్రయాణం' సినిమాతో హీరోయిన్ గా పాయల్ పరిచయమైంది. ఆ తర్వాత ఊసరవెళ్లి సినిమాలో తమన్నా పక్కన సహాయనటిగా నటించింది. బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు పొందింది.