పాయల్ అంతా చీప్ పబ్లిసిటీ స్టంట్!?

Tue Nov 30 2021 16:05:55 GMT+0530 (IST)

Payal Cheap Publicity Stunt

ఆర్.ఎక్స్ 100 చిత్రంతో తెలుగు యువత గుండెల్ని గుల్ల చేసిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత వరుస చిత్రాలతో కెరీర్ పరంగా బిజీ అయ్యింది. ఆరంగేట్రమే బోల్డ్ అండ్ డస్కీ బ్యూటీగా యూత్ కి కిక్కు పుట్టించిన ఈ బ్యూటీ ఆ తర్వాత కొన్ని తప్పులు చేసి కెరీర్ పరంగా రేస్ లో వెనకబడింది.కానీ ఇంతలోనే కంబ్యాక్ అయిన తీరు ఆసక్తికరం. ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటిస్తూనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. అయితే పాయల్ కంబ్యాక్ కి సహకరించిన ఆ కీలక ఎలిమెంట్ ఏదీ? అన్నది విశ్లేషిస్తే.. ఈ బ్యూటీ నిరంతరం కుర్రాకారుకు ఇస్తున్న ఇన్ స్టా ట్రీట్ అని అర్థమవుతోంది. సోషల్ మీడియాల్లో ఇతర భామలతో పోలిస్తే పాయల్ కాస్త కాంట్రవర్శియల్ గానే దూసుకెళుతోంది. వివాదాలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. దాంతో పాటే ప్రకటనల్లో నటిస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తోంది.

తనలోని అందచందాల్ని సామాజిక మాధ్యమాల్లో ఎలివేట్ చేసేందుకు నిరంతరం పాయల్ తపించడం వెనక జిమ్మిక్ ఇదే. ఇటీవల వరుస బోల్డ్ ఫోటోషూట్లతో పాయల్ విరుచుకుపడుతున్న తీరు వివాదాస్పదమవుతోంది. ఇంతకుముందు ఎద అందాలను ఎలివేట్ చేస్తూ టూమచ్ హాట్ గా విరుచుకుపడిన ఫోటోని పాయల్ షేర్ చేసి అంతలోనే ఇన్ స్టా నుంచి డిలీట్ చేసింది. ఇలాంటి ఘాటైన ఫోజులతో రెచ్చిపోవడం సరికాదని ఫ్యాన్స్ వారించబోగా ఆ ఫోటోని తొలగించిందని భావించారు.

అయితే ఇప్పుడు మరోసారి పాయల్ సేమ్ ట్రిక్ ని ప్లే చేస్తూ ఎల్లో జంప్ సూట్ ధరించి రకరకాల భంగిమల్లో అందాలను ఆరబోస్తూ వేడెక్కించింది. అయితే ఈ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేసిన నిమిషాల్లోనే ఫ్యాన్స్ కి మతి చెడింది. కానీ దీనిపైనా విమర్శల్ని ఎదుర్కొంది పాయల్. దాంతో నిమిషాల్లోనే తిరిగి తొలగించింది. పాయల్ మరీ అతి చేస్తోందా? ప్రచారం కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజనులు. పబ్లిసిటీ కోసం మరీ ఇంతగా దిగజారాలా? ఇన్ స్టా లైక్ లు క్లిక్ ల కోసమేనా ఈ తెగింపు? అంటూ ఒక సెక్షన్ అభిమానులు చీవాట్లు పెట్టేస్తున్నారు. అయితే తనకు తెలీకుండానే అలా ఫోజులిచ్చేసి దొరికిపోయిందని కూడా ఒక సెక్షన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి వీటన్నిటికీ పాయల్ కౌంటర్ వేస్తుందేమో చూడాలి.

ఇక పాయల్ సినిమా విషయానికి వస్తే బెంగుళూరు సిటీని మొట్ట మొదటగా గడగడలాడిండించిన జయరాజ్ బయోపిక్ `హెడ్ బుష్` టైటిల్ తో తెరకెక్కుతోంది. ఇందులో డాన్ మొదటి గాళ్ ప్రెండ్ పాత్రలో నటిస్తోంది. జయరాజ్ కి చాలా మంది గాళ్ ప్రెండ్స్ ఉండగా పాయల్ పోషించే పాత్ర మాత్రం చాలా కీలకమైనది. డాన్ జీవితంలో కొన్ని మార్పులు సైతం తీసుకొచ్చిన రోల్ అది. ఈ నేపథ్యంలో పాయల్ పాత్రకు మంచి పేరొచ్చే అవకాశం ఉంది.