Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఒక్క‌డి కోసం ప‌రిశ్ర‌మను నాశ‌నం చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   26 Sep 2021 8:57 AM GMT
ప‌వ‌న్ ఒక్క‌డి కోసం ప‌రిశ్ర‌మను నాశ‌నం చేస్తున్నారా?
X
ఓవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినీరంగంలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు సినీపెద్ద‌ల‌తో మంత‌నాలు సాగిస్తోంది. ప్ర‌భుత్వం సొంత వెబ్ సైట్ ద్వారా టిక్కెట్లు అమ్మేందుకు నిర్ణ‌యించింది. మ‌రికొన్ని సినీపెద్ద‌లు వినిపించిన స‌మ‌స్య‌ల‌ను వినేందుకు మంత్రి పేర్ని నానీతో భేటీలు ఏర్పాటు చేస్తోంది. త్వ‌ర‌లో సీఎం జ‌గ‌న్ తో నేరుగా సినీపెద్ద హోదాలో మెగాస్టార్ చిరంజీవి క‌లిసి మాట్లాడుతార‌ని అంతా భావిస్తున్నారు. అయితే ఇంత‌లోనే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రిప‌బ్లిక్ ప్ర‌చార వేదిక‌పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

నా ఒక్క‌డి కోసం ప‌రిశ్ర‌మ‌ను నాశ‌నం చేస్తోంది ఏపీ ప్ర‌భుత్వం అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. వ‌కీల్ సాబ్ రిలీజ్ ముందు టిక్కెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించేస్తూ జీవోని జారీ చేయ‌డం బెనిఫిట్ షోలను ర‌ద్దు చేయ‌డం వ‌గైరా వ‌గైరా అంశాల‌పై చాలా కాలంగా చ‌ర్చ సాగుతూనే ఉంది. తాజా ఎమోష‌న‌ల్ స్పీచ్ లో ప‌వ‌న్ ఏపీ ప్ర‌భుత్వ తీరు తెన్నుల‌ను ఎండ‌గ‌ట్టారు. ఇందులో భాగంగా త‌న కోసం ప‌రిశ్ర‌మ‌ను నాశ‌నం చేయ‌డం స‌రికాద‌ని అన‌డం ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇది నిజ‌మా? అంటే .. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాలు కేవ‌లం ప‌వ‌న్ కి మాత్ర‌మే కాదు.. మొత్తం ప‌రిశ్ర‌మ‌లో ఉన్న అంద‌రికీ వ‌ర్తిస్తుందని విశ్లేషిస్తున్నారు. అన్ని పెద్ద సినిమాల‌కు బెనిఫిట్ షోల‌ను ప‌ర్మినెంట్ గా ర‌ద్దు చేశారు. వాటి కోసం ఇక ప్ర‌భుత్వాల్ని సంప్ర‌దించాల్సిన అవ‌స‌రం లేదు. మునుముందు రిలీజ్ కి రానున్న చిరంజీవి- ఆచార్య‌.. రాజ‌మౌళి - ఆర్.ఆర్.ఆర్.. కేజీఎఫ్ .. స‌ర్కార్ వారి పాట‌.. పుష్ప .. ఒక‌టేమిటి బ‌డా సినిమాల‌న్నిటికీ ఇదే ప‌రిస్థితి ఉండ‌నుంది. ఇక టిక్కెట్టు ధ‌ర‌ల్ని పెంచే ఆలోచ‌న ఏపీ ప్ర‌భుత్వం వ‌ద్ద ఉందా లేదా? అన్న‌దానిపై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి క్లారిటీ లేదు. దానిపై ప‌రిశీల‌న‌లు చేస్తామ‌ని మంత్రి నానీ నుంచి హామీ త‌ప్ప గ్యారెంటీ లేదు. ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే ప‌వ‌న్ విసిరిన పంచ్ ల‌తో ఏపీ ప్రభుత్వం సినీప‌రిశ్ర‌మ‌కు ఇంకా దూరం జ‌ర‌గ‌నుందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని ప‌రిశ్ర‌మ ఇన్ సైడ్ చ‌ర్చ సాగుతోంది. అయితే సినీప‌రిశ్ర‌మ‌తో స‌ఖ్య‌త కోసం ప్ర‌య‌త్నించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఇటీవ‌లి ప‌రిణామాలేవీ స‌రిగా క‌లిసొస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. తొలి నుంచి ప‌రిశ్ర‌మ‌లో ఒక సెక్ష‌న్ బ‌డా నిర్మాత‌లు ఆయ‌న‌ను క‌ల‌వ‌లేద‌న్న చ‌ర్చా నిరంత‌రం సాగుతూనే ఉంది. కార‌ణం ఏదైనా ఈ స‌మ‌స్య‌కు ప‌ర్మినెంట్ సొల్యూష‌న్ త‌క్ష‌ణావ‌శ్యం గా క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వాలు ప్రోత్స‌హించినప్పుడు మాత్ర‌మే వినోద‌ప‌రిశ్ర‌మ‌లు మ‌నుగ‌డ సాగించ‌గ‌ల‌వు. దానికి ఏపీ ప్ర‌భుత్వం స‌హ‌క‌రించడం చాలా అవ‌స‌రం.