Begin typing your search above and press return to search.

పాతికేళ్ల గ్యాప్.. సేమ్ టు సేమ్..!

By:  Tupaki Desk   |   27 Nov 2022 12:58 PM GMT
పాతికేళ్ల గ్యాప్.. సేమ్ టు సేమ్..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందే మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సాధించారు. కరాటేలో ఆయనకు బ్లాక్ బెల్ట్ కూడా ఉందని తెలిసిందే. అందుకే తన మొదటి సినిమా నుంచి మార్షల్ ఆర్ట్స్ ని ప్రత్యేకంగా చూపిస్తూ వచ్చారు. పవన్ చేసిన సినిమాల్లో బాక్సింగ్ నేపథ్యం తీసుకున్న కొన్ని సినిమాలకు ప్రేరణ ఆయనకు మార్షల్ ఆర్ట్స్ లో అనుభవం ఉండటమే. ఇక లేటెస్ట్ గా పవన్ పాతికేళ్ల క్రితం నాటి ఫోటో అది కూడా కరాటే డ్రెస్ లో ఉన్న ఫోటో తో పాటుగా లేటెస్ట్ గా అదే డ్రెస్ తో ఉన్న ఫోటోని జత చేశారు.

1997, 2022 పాతికేళ్ల గ్యాప్ తప్ప పవన్ లో మాత్రం పెద్ద తేడా ఏమి లేదు. అయితే 97లో పవన్ కొద్దిగా బక్కపలచగా ఉన్నాడు. ఇప్పుడు కొద్దిగా కండపట్టి ఉన్నారు. ఆ చిన్న తేడా తప్ప ఆ రెండు ఫోటోల్లో పెద్ద తేడాలు ఏమీ లేవు. ఇక పాతికేళ్లు అవుతున్నా కరాటే మీద తన టచ్ పోగొట్టుకోలేదు పవన్. ప్రస్తుతం చేస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో కొన్ని సీన్స్ మార్షల్ ఆర్ట్స్ తో ఉంటాయని టాక్. అందుకే పవన్ కరాటే డ్రెస్ తో కనిపించారు.

హరి హర వీరమల్లు సినిమా విషయానికి వస్తే క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఎప్పుడో మొదలైనా ఇప్పటికీ సగం కూడా పూర్తి కాలేదని అంటున్నారు. సాధారణంగా క్రిష్ తన సినిమాని అనుకున్న విధంగా అనుకున్న టైం లో పూర్తి చేస్తాడు కానీ పవన్ తన పనుల వల్ల ఈ మూవీకి టైం కేటాయించలేకపోతున్నాడు.

అందుకే క్రిష్ తన కెరీర్ లోనే మొదటిసారి ఒక సినిమాకు ఎక్కువ రోజులు తీసుకుంటున్నాడు. అయితే ఫ్యాన్స్ హర్ట్ అవకుండా సినిమా అంచనాలకు తగినట్లుగా రావాలంటే కొద్దిగా ఓపిక తప్పదంటూ ఫ్యాన్స్ కి ఓ లెటర్ కూడా షేర్ చేశారు.

ఓ పక్క పాలిటిక్స్, మరో పక్క సినిమాలు ఇలా రెండిటినీ బ్యాలన్స్ చేసేందుకు పవన్ చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో సినిమా మేజర్ పార్ట్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట చిత్రయూనిట్. 2023 సమ్మర్ రేసులో అయినా మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.