షూటింగ్ సగం పూర్తి అయ్యాక పవన్ హీరోయిన్ మార్పు?

Mon May 03 2021 10:01:10 GMT+0530 (IST)

Pawan 'heroine' change after shooting is half over?

మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ తెలుగు రీమేక్ హీరోయిన్ విషయమై మళ్లీ చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కు జోడీగా మొదట సాయి పల్లవి ని ఎంపిక చేయడం జరిగింది. ఐశ్వర్య రాజేష్ పేరు కూడా ప్రస్థావనకు వచ్చింది. సాయి పల్లవి షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుందని కూడా వార్తలు వచ్చాయి. కాని సాయి పల్లవి పలు సినిమా ల్లో నటిస్తున్న కారణంగా ఆమె రీమేక్ కు డేట్లు ఇవ్వలేక పోతుందట. ఇప్పటికే ఈ రీమేక్ ను దాదాపుగా 60 శాతం పూర్తి చేశారని సమాచారం అందుతోంది.షూటింగ్ సగం కంటే ఎక్కువే పూర్తి అయిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ విషయమై మళ్లీ చర్చలు జరపడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. సాయి పల్లవి ఇంకా షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు. కనుక ఆమె స్థానంలో ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ను నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది. సినిమా లో పవన్ భార్య పాత్ర కనిపించేది కొద్ది సమయమే అయినా కూడా చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రగా తెలుస్తోంది. మాజీ గిరిజన నక్సలైట్ గా పవన్ భార్య కనిపించాల్సి ఉంటుంది. అందుకే నటిగా మంచి ప్రతిభ కనబర్చే వారిని మాత్రమే ఈ సినిమా కోసం తీసుకోవాలని భావించారు.

నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిభ ఉన్న నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. త్రివిక్రమ్ గతంలో బన్నీ సన్నాఫ్ సత్యమూర్తి సినిమా లో ఈమెను నటింపజేశాడు. దాంతో త్రివిక్రమ్ సలహా మేరకు ఈ రీమేక్ లో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆమె షూటింగ్ లో కూడా జాయిన్ అవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. పవన్ తో ఆమె మొదటి సారి జత కట్టబోతుంది కనుక ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒరిజినల్ వర్షన్ లో కంటే రీమేక్ లో ఆ పాత్ర నిడివి కాస్త ఎక్కువగా ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి.