పవన్ రెండేళ్లలో అయిదు సినిమాలు

Sun Sep 27 2020 20:30:33 GMT+0530 (IST)

Pawan has five films in two years

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ హిట్ మూవీ 'పింక్' రీమేక్ వకీల్ సాబ్ లో నటించేందుకు కమిట్ అయ్యాడు. ఆ సినిమా కమిట్ అయిన వెంటనే క్రిష్ దర్వకత్వంలో కూడా ఒక సినిమాను చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ రెండు సినిమాలు కాకుండా హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమాను చేయబోతున్నాడు. ఈ మూడు సినిమాలు అధికారికంగా ప్రకటన వచ్చాయి. మొదటి రెండు సినిమాలు ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. వచ్చే ఏడాదిలో వకీల్ సాబ్ మరియు క్రిష్ మూవీలు విడుదల కాబోతున్నాయి. వీలైతే హరీష్ శంకర్ మూవీ కూడా వచ్చే ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.ఈ మూడు సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాతో పాటు దర్శకుడు డాలీ దర్శకత్వంలోనూ పవన్ ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పారట. ఈ రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2021 మరియు 22 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ నుండి ఈ అయిదు సినిమాలు వస్తాయంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. రెండు లేదా మూడు సినిమాలు వచ్చే ఏడాదిలో విడుదల చేస్తే ఆ తర్వాత ఏడాదిలో మిగిలిన సినిమాలు వస్తాయి.