Begin typing your search above and press return to search.

పవన్​-తేజ్​ వినోదయ సిత్తం.. అది నిజమేనంటా.. కానీ?

By:  Tupaki Desk   |   28 Jan 2023 2:44 PM GMT
పవన్​-తేజ్​ వినోదయ సిత్తం.. అది నిజమేనంటా.. కానీ?
X
పవర్​ స్టార్​ పవన్‌కల్యాణ్‌ చేతిలో బోలెడన్ని సినిమాలున్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని సెట్స్‌పై ఉండగా, మరికొన్ని స్క్రిప్ట్‌ దశలో ఉన్నాయి. వీటి మధ్యలో మరో కొత్త సినిమాని మొదలుపెట్టారు. అదే... 'వినోదయ సిత్తం' రీమేక్‌. తమిళంలో విజయవంతమైన ఈ సినిమా తెలుగు రీమేక్‌లో తన మేనల్లుడు సాయి తేజ్‌తో కలిసి నటిస్తున్నారు పవన్‌కల్యాణ్‌.

ఇప్పటికే ఈ చిత్రానికి కొబ్బరికాయా కూడా కొట్టారు. కానీ ఆ తర్వాతే ఏమి అప్డేట్స్​ లేవు. ఇలా అభిమానులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఈ సినిమా.. కథలో మార్పులు, డేట్స్ సర్దుబాట్లు.. ఇలా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది.

అయితే తాజాగా మరో వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే కథలో మార్పులు జరుగుతున్నాయని క్లారిటీ వచ్చింది. అయితే ఒరిజినల్​ స్క్రిప్ట్​ దెబ్బ తినకుండా మెయిన్ థీమ్​ అలానే ఉండేలా చేస్తున్నారని తెలిసింది.

ఏదేమైనప్పటికీ ఈ చిన్న అప్డేట్​ వచ్చేసరికి మళ్లీ సినిమాపై ఆడియెన్స్​కు ఆసక్తి పెరిగిపోయింది. ఎప్పుడు వస్తుందాని తెగ ఆరాటపడుతున్నారు. మాతృకని తెరకెక్కించిన సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ రచన చేశారు. ఇందులో పవన్‌కల్యాణ్‌ మనిషి రూపంలోని దేవుడిగా కనిపిస్తారని సమాచారం.

ఇకపోతే పవన్​ చేస్తున్న సినిమాల్లో ఒకటి క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు'. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్‌ గజదొంగగా కనిపించనున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ 'వినోదయ సిత్తం' రీమేక్‌లో నటిస్తారని తెలిసింది. మరోవైపు హరీశ్‌ శంకర్‌తో భవదీయుడు భగత్‌సింగ్‌ పట్టాలెక్కించనున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.