Begin typing your search above and press return to search.

పవన్ OG.. అల్లు అరవింద్ గ్యాంగ్​స్టార్ ట్విస్ట్!

By:  Tupaki Desk   |   31 Jan 2023 11:31 AM GMT
పవన్ OG.. అల్లు అరవింద్ గ్యాంగ్​స్టార్ ట్విస్ట్!
X
పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌- సాహో డైరెక్టర్ సుజీత్‌ కాంబినేషన్‌లో భారీ భారీ యాక్షన్‌ డ్రామా​ చిత్రం 'OG' రూపొందుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్​గా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టగా.. సురేశ్​బాబు కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దిల్‌రాజు, అరవింద్‌ దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్‌ అందించారు. ఇందులో పవన్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అనుమానం కొంతమంది మెదడులో మెదులుతోంది. అదేంటంటే ఈ సినిమాకు అసలైన ఒరిజినల్​ గ్యాంగ్​స్టర్​ అల్లు అరవింద్​ అని అంటున్నారు.

ఎందుకంటే నిన్న గ్రాండ్​గా జరిగిన ఈవెంట్​లో పవన్​తో పాటు అల్లు అరవింద్​ స్పెషల్ అట్రాక్షన్​గా కనిపించారు. ఈ చిత్రాన్ని డీవీవీ నిర్మిస్తున్నప్పటికీ.. ఈ చిత్రంలో అరవింద్​ కూడా భాగస్వామ్యమయ్యారని సమాచారం అందుతోంది. ఆయన వెనక నుంచి సైలైంట్​గా ఫైనాన్స్​ చేస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని అల్లు స్డూడియోస్​లో చిత్రీకరించనున్నారట. ఇక సినిమా రిలీజ్​ విషయాలకు సంబంధించిన పనులు కూడా చూసుకోబోతున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదుగానీ ప్రస్తుతం ఈ ప్రచారం ఊపందుకుంది.

ఇక ఈ సినిమా విషయానికొస్తే.. ఒక్క అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌తోనే సోషల్‌ మీడియా షేక్‌ అయింది. సాహో లాంటి హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తర్వాత దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకుని సుజిత్‌ ఈ కథను సిద్ధం చేశాడు. పైగా అతడు పవన్‌కు సుజీత్‌ వీరాభిమాని కావడంతో ఈ సినిమా ఏ లెవల్లో ఉంటుందో అని అభిమానులందరూ భారీగా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకుంటున్నారు. ఇంకా ఆర్​ఆర్​ఆర్​ లాంటి భారీ హిట్​ అందుకున్న తర్వాత డీవీవీ..

ఈ సినిమా చేయడం కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. "ఇటు యాక్షన్‌ ప్రియులకు, అటు పవన్‌ అభిమానులకు ఇది పండుగలాంటి చిత్రమ"ని నిర్మాత దానయ్య ప్రకటించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తామన్నారు. అయితే ఈ సినిమా పంజా, సాహా లాంటి అవుట్​ పుట్​ కాకుండా కేజీయఫ్, పఠాన్​ లాంటి ఫలితం దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇకపోతే నిన్న అన్నపూర్ణ స్టూడీయోస్‌లో గ్రాండ్​గా జరిగిన ఈ మూవీ లాంచ్​ ఈవెంట్​లో ​పవన్‌ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఫొటోస్​ కూడా సోషల్​మీడియాలో వైరల్​ అయ్యాయి. ఫ్యాన్స్​ ఫుల్ ఖుషీ అయ్యారు. పవన్​ ఈజ్​ బ్యాక్​, యంగ్ లుక్​లో కనిపిస్తున్నారని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో హరీష్‌ శంకర్‌, శ్రీవాస్‌, వివేక్‌ ఆత్రేయ, బీవీఎస్ఎన్‌ ప్రసాద్‌, ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.