నూనూగు మీసాల పవన్ ని చూశారా?

Thu Sep 12 2019 21:34:03 GMT+0530 (IST)

Pawan Kalyan has a huge and different fan following among the Mega family heroes

అప్పుడే నూనూగు మీసాలు మొలకెత్తే కుర్రాడు ఎలా ఉంటాడు?  బాల్యం వదిలి కౌమారంలోకి అడుగు పెట్టేప్పుడు సింప్టమ్స్ ఎలా ఉంటాయి?  ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే అనుభవమే కదా ఇది. ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే మన కౌమారం ఎలాంటిదో గుర్తుకు తెచ్చుకునే వీలుంది. మన సంగతేమో గానీ.. కౌమార దశలో కొణిదెల బెదరు పవన్ కల్యాణ్ ఎలా ఉండేవారు? అంటే ఇదిగో ఇలా ఉండేవారని అభిమానులు ఓ ఫోటోని షేర్ చేశారు. ఆ ఫోటోలో పవన్ ఛామింగ్ లుక్ స్టన్నింగ్. సూదంటు చూపులతో గుచ్చేస్తున్నాడు. ఆ కళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. మెగాస్టార్ లో స్పెషాలిటీ ఏది అంటే అదరూ ఆ కళ్ల ఆకర్షణనే హైలైట్ గా చెబుతుంటారు. చిరు చూసే తీరు స్టన్నింగ్ అని అభిమానులు చెబుతుంటారు. అదే తీరుగా పవన్ కళ్లు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.వేరొక కోణంలో చూస్తే .. ఈ ఫోటోలో పవన్ కాస్త అఖీరా లా మరి కొంత చరణ్ లుక్ లో కనిపించాడు. అంటే చిరు-చరణ్- పవన్- అఖీరాల్లో కామన్ ఫ్యాక్టర్ ఆ అందమైన కళ్లు అని డిక్లేర్ అవ్వొచ్చు. ఆ కళ్లు వారసత్వ సంపద అని చెప్పాలి. ఇక ఆ ఫోటోలో అసలే నిక్కరు- టీషర్ట్ తో పవన్ కనిపించిన తీరు ఆకట్టుకుంది. టీనేజ్ లో అడుగు పెట్టేప్పుడు నూనూగు మీసాల బోయ్ లా మారేప్పటి ఫోటో ఇది. ఆ కళ్లు.. ఐబ్రోస్.. ముకు తీరు.. పక్క పాపిడి స్మార్ట్ బోయ్ అనిపిస్తున్నాడు. ఇంట్లో అందరి కంటే చిన్నోడు కావడంతో అతడు ఆడిందే ఆట పాడిందే పాట అయ్యేది అప్పట్లో. అతడు పదో తరగతి పూర్తవ్వగానే ఈ చదువులు మనకెందుకు అనుకుని అన్న- వదినల వద్దకు వచ్చేశాడు. హైదరాబాద్ కి చిరంజీవి - సురేఖ వద్దకు వచ్చానని తనే స్వయంగా చెప్పాడు  చాలాసార్లు. అందుకే ఆ ఇద్దరినీ అమ్మా నాన్నల కంటే ఎక్కువగా ప్రేమించి గౌరవిస్తాడు.

మెగా హీరోలందరిలోకి చిరంజీవి తర్వాత భారీగా ఫాలోయంగ్ ఉన్న స్టార్ పవన్. పవన్ అభిమానులు వీర భక్తుల్ని తలపిస్తారు. అందుకు తగ్గట్టే పవన్ కూడా అభిమానుల్ని అంతే గౌరవిస్తారు. ఈ బాండింగ్ వల్ల అతడి పాపులారిటీ అంతే ఇదిగా పెరిగింది. పవర్ స్టార్ అభిమానులకు సోషల్ మీడియాలో ఫ్యాన్ పేజీలు చాలానే ఉన్నాయి. పవన్ కి సంబంధించిన ప్రతి ఫోటోని అభిమానులు షేర్ చేయడం అలవాటే. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటో జోరుగా వైరల్ అయిపోతోంది.