'పవర్ స్టార్' స్టిల్స్ పై పవన్ స్పందన ఇదేనట?

Tue Jul 14 2020 23:38:02 GMT+0530 (IST)

this Is Pawan's reaction to 'Power Star' stills?

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘పవర్ స్టార్’ మూవీకి సంబంధించి రోజుకో స్టిల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ తో పాటు చిరంజీవి.. నాగబాబు.. చంద్రబాబు నాయుడు పాత్రలను కూడా వర్మ రివీల్ చేశాడు. షూటింగ్ చకచక జరుపుతున్న వర్మ త్వరలోనే విడుదల చేసేందుకు సోషల్ మీడియాలో హడావుడి మొదలు పెట్టాడు. తన ప్రతి సినిమాకు కూడా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ లు పెట్టడం వల్ల మంచి పబ్లిసిటీ దక్కించుకుంటున్న వర్మ తాజాగా పవర్ స్టార్ స్టిల్స్ ను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూనే ఉన్నాడు.వర్మ ట్వీట్స్ ఇటీవల పవన్ దృష్టికి వచ్చాయని వాటిని చూసి పవన్ ఒక చిన్న నవ్వు నవ్వేశాడంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పవన్ ఇలాంటి విషయాల గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశాడని వర్మ తెరకెక్కిస్తున్న పవర్ స్టార్ సినిమా గురించి పవన్ కనీసం ఆలోచించడం కూడా లేదని పవన్ సన్నిహితులు అంటున్నారు. వర్మ గురించి పవన్ అభిమానులు కూడా పట్టించుకోవడం మానేశారన్నారు.

గతంలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా పవన్ పెద్దగా స్పందించలేదు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో కూడా పవన్ గురించి వర్మ చూపించాడు. అయితే ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు. కనుక వర్మ సినిమాలో పవన్ గురించి చెడుగా చూపించినంత మాత్రాన పోయేది ఏమీ లేదని పవన్ అభిప్రాయంగా మారింది.