పవన్ హెల్త్ బులిటెన్ రిలీజ్.. కండీషన్ ఇదే!

Sun Apr 18 2021 23:22:09 GMT+0530 (IST)

Pawan Kalyan Health Bulletin Release

‘వకీల్ సాబ్’తో గ్రాండ్ గా రీ-ఎంట్రీ ఇచ్చారు పవర్ స్టార్. కానీ.. ఆ జోష్ ను ఫ్యాన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేయకుండా కొవిడ్ మహమ్మారి బారిన పడ్డారు పవన్. తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో పలువురు కొవిడ్ బారిన పడడంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పవన్ కల్యాణ్ క్వారంటైన్లోకి వెళ్లారు.కానీ.. ఏదైతే జరగొద్దని ఫ్యాన్స్ ఆందోళన చెందారో.. చివరకు అదే జరిగింది. క్వారంటైన్ నుంచి పవన్ ఆసుపత్రికి వెళ్లడం.. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో.. మెగా ఫ్యాన్స్ తోపాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

నిన్నటి వరకు లంగ్స్ ఇన్ఫెక్షన్ తో పవన్ బాధపడుతున్నట్టు రిపోర్టులు వచ్చాయి. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో.. పవన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ పూజలు నిర్వహించారు. సహ నటులు రాజకీయ నాయకులు కూడా పవన్ ఆరోగ్యంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. పవన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. తన ఆరోగ్యం కోలుకోవాలని ఆకాంక్షించిన అభిమానులు సహనటులు రాజకీయ నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు పవన్. అదేవిధంగా ప్రజలకు కరోనా జాగ్రత్తలు కూడా సూచించారు. బయటకు వెళ్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ప్రతి ఒక్కరూ శానిటైజర్లు ధరించాలని కోరారు.