Begin typing your search above and press return to search.

జీవితంలో త‌ప్పు చేశావ్!.. ప‌వ‌న్ అభిమానులు ఫైరింగ్

By:  Tupaki Desk   |   15 July 2020 8:10 AM GMT
జీవితంలో త‌ప్పు చేశావ్!.. ప‌వ‌న్ అభిమానులు ఫైరింగ్
X
బ‌యోపిక్ ల పేరుతో ప్ర‌ముఖుల్ని టార్గెట్ చేస్తున్న ఆర్జీవీ ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ ని టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` పేరుతో చంద్ర‌బాబును ఆయ‌న వార‌సుడు లోకేష్ నాయుడిని టార్గెట్‌ చేసిన ఆర్జీవీ.. ఈసారి `ప‌వ‌ర్ స్టార్` మూవీ పేరుతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ని ఆయ‌న అభిమానుల్ని టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. జ‌న‌సేనాని రాజ‌కీయ వైఫ‌ల్యాన్ని సెటైరిక‌ల్ గా చూపించ‌నున్నాడ‌ని ఇన్ సైడ్ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆ క్ర‌మంలోనే ప‌వ‌న్ అభిమానులు జ‌న‌సైనికులు వ‌ర్మ అంటేనే మ‌రిగిపోతున్నారు.

ప‌వ‌ర్ స్టార్ మూవీ వివాదాస్ప‌దం అయితే ప‌వ‌న్ ఫ్యాన్స్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో ఆర్జీవీ ఇప్ప‌టికే ఊహించేస్తున్నారు. కానీ ఆయ‌న త‌న ప‌నిని మాత్రం మానుకోలేదు. టైటిల్ స‌హా కంటెంట్ విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఇక ప‌వ‌ర్ స్టార్ లుక్ లాంచ్ పేరుతో ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు ప‌వ‌న్ అభిమానుల్లో వైర‌ల్ గా మారాయి. ఆర్జీవీ వ్యంగ్యానికి మ‌రిగిపోతూ కోపాన్ని క‌క్క‌లేక మింగ‌లేక వేచి చూస్తున్నారు.

తాజాగా ఆర్జీవీ ట్విట్టర్ ‌లో `పవర్ స్టార్`‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నటుడిని పరిచయం చేసారు.తాజా పోస్ట‌ర్ మరోసారి పవన్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ``అతను ఒక అద్భుతమైన నటుడు.. ఏ స్టార్ కంటే కూడా ఎక్కువ ప‌వ‌ర్ ఫుల్`` అని వ్యాఖ్య‌ను ఆర్జీవీ జోడించారు. ఫెంటాస్టిక్.. మోర్ ప‌వ‌ర్ ఫుల్ స్టార్ ఈయ‌నే అంటూ ప‌రిచ‌యం చేసారు. అస‌లే కోపంగా ఉన్న పవన్ అభిమానులను మరోసారి కెలికార‌నే చెప్పాలి. ఇలా ఫోటోల‌తో ఎగ‌తాళి చేసే మీరు ప‌వ‌న్ అభిమాని అని ఎలా చెప్పుకుంటారు? అంటూ కోపోద్రిక్తుడైన ఓ అభిమాని ఆర్జీవీని ప్ర‌శ్నించారు. ఇక టైటిల్ పాత్ర పోషిస్తున్న న‌టుడిని ప‌వ‌న్ అభిమాని హెచ్చ‌రించారు. పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ చిత్రంలో నటించడం మీ జీవితంలో అతి పెద్ద తప్పు అని అభిమాని వార్నింగ్ ఇచ్చారు.