Begin typing your search above and press return to search.

తండ్రి కొడుకులుగా ప‌వ‌న్ ద్విపాత్రాభిన‌యం?

By:  Tupaki Desk   |   26 Nov 2020 2:30 AM GMT
తండ్రి కొడుకులుగా ప‌వ‌న్ ద్విపాత్రాభిన‌యం?
X
ద్విపాత్రాభిన‌యం త్రిపాత్రాభిన‌యం అంటే అంత సులువేమీ కాదు. దానికోసం ప్ర‌త్యేకించి ప్రిప‌రేషన్ కావాలి. పాత్ర ప‌రంగా వైవిధ్యం చూపించేందుకు గెట‌ప్ మార్చాలి. న‌ట‌న ప‌రంగా వేరియేష‌న్ కూడా చూపించాలి. భాష‌.. యాస‌.. రూపం ప్ర‌తిదీ మారాలి. ఈ త‌ర‌హా పాత్ర‌ల్లోకి ప‌ర‌కాయం చేయ‌డంలో మెగాస్టార్ చిరంజీవి త‌న త‌ర్వాతే ఎవ‌రైనా అని ప్రూవ్ చేశారు. వెట‌ర‌న్ హీరోల్లో ఎక్కువ‌మంది ద్విపాత్ర‌ల్ని ప్ర‌య‌త్నించి మెప్పించిన వారు ఉన్నారు.

అయితే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం అన్నయ్య చిరంజీవిలా ద్విపాత్రాభిన‌యం చేసింది లేదు. తీన్ మార్ లో డ్యూయ‌ల్ షేడ్ ఉన్న పాత్ర‌లో క‌నిపించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని స‌ప‌రేట్ గా డిజైన్ చేశారు జ‌యంత్ సి ఫ‌రాన్జీ. కానీ పూర్తి స్థాయిలో ద్విపాత్ర‌లు చేసింది లేదు.

ప్ర‌స్తుతం కంబ్యాక్ లో పింక్ రీమేక్ `వ‌కీల్ సాబ్` లో న‌టిస్తున్న ప‌వన్ త‌దుప‌రి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. క్రిష్ మూవీలో రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తున్నా ఇందులో ద్విపాత్రాభినయం చేయ‌డం లేదు.

ఇప్పుడు గ‌బ్బ‌ర్ సింగ్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కి అరుదైన ఛాన్స్ ద‌క్కింది. ఇప్పుడు ప‌వ‌న్ ని ద్విపాత్ర‌ల్లో చూపించేందుకు రెడీ అవుతున్నాడ‌ని స‌మాచారం. ప‌వ‌న్ ఈ మూవీలో తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపిస్తారట పవన్‌. ఇక హ‌రీష్ శంక‌ర్ మాస్ రోల్స్ ని ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్ది... పాత్ర‌ల న‌డుమ వేరియేష‌న్ ని అద్భుతంగా డిజైన్ చేయ‌గ‌ల‌ స‌మ‌ర్ధుడిగా గుర్తింపు ఉంది. ఇంత‌కుముందు వ‌రుణ్ తేజ్ ని గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ పాత్ర‌లో పూర్తి మాస్ హీరోగా ఆవిష్క‌రించిన తీరు కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇప్పుడు గబ్బ‌ర్ సింగ్ త‌ర్వాత డ‌బుల్ ట్రీటిచ్చేందుకు ప‌వ‌న్ - హ‌రీష్ జోడీ రెడీ అవుతుండ‌డం ఆస‌క్తిని రేపుతోంది.