Begin typing your search above and press return to search.

భీమ్లా రికార్డ్ కు ఇప్పట్లో ఢోకా లేనట్లే!

By:  Tupaki Desk   |   25 Sep 2021 5:30 AM GMT
భీమ్లా రికార్డ్ కు ఇప్పట్లో ఢోకా లేనట్లే!
X
పవన్ కళ్యాణ్‌ భీమ్లా నాయక్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు రచన సహకారంను త్రివిక్రమ్‌ అందిస్తున్నాడు. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ కు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా లో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నాడు. ఇటీవలే పవన్‌ లుక్ కు సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేశారు. ఈ గ్లిమ్స్ కు ఆల్‌ ఇండియా రికార్డు దక్కింది. మొదటి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను దక్కించుకున్న గ్లిమ్స్ గా భీమ్లా నాయక్ వీడియో నిలిచింది. పవన్‌ క్రేజ్ తో ఈ రికార్డు నమోదు అయ్యింది. ఈ రికార్డును తమిళ హీరో అజిత్ తన వాలిమై గ్లిమ్స్ తో బ్రేక్ చేస్తాడని అంతా భావించారు. కాని పవన్‌ రికార్డును చేరుకోవడంలో అజిత్ వెనుకబడ్డాడు. ఆయన వాలిమై సినిమాకు 24 గంటల్లో 6.8 మిలియన్ ల వ్యూస్ మాత్రమే వచ్చాయి.

పవన్‌ భీమ్లానాయక్ గ్లిమ్స్ కు మాత్రం ఏకంగా 8.4 వ్యూస్ రావడంతో పాటు అత్యధిక లైక్స్ కూడా దక్కాయి. అత్యధిక వ్యూస్ తో పాటు అత్యధిక లైక్స్ ను దక్కించుకున్న భీమ్లా నాయక్‌ రికార్డుకు ఇప్పట్లో ఎలాంటి ఢోకా లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమా గ్లిమ్స్ లో పవన్ మాస్ లుక్‌ మరియు మాస్ డైలాగ్‌ అందరిని ఆకట్టుకున్నాయి. అందుకే ఒకటికి పది సార్లు అభిమానులు చూడటం జరిగింది. అభిమానులతో పాటు అంతా కూడా పవన్‌ భీమ్లా నాయక్‌ లుక్ ను ఇష్టపడ్డారు. అందుకే ఈ గ్లిమ్స్ కు భారీ రికార్డు నమోదు అయ్యింది అనడంలో సందేహం లేదు. మిలియన్ లైక్స్ ను క్రాస్ చేసిన భీమ్లా నాయక్‌ ఇంకా వ్యూస్ పరంగా దూసుకు పోతూనే ఉన్నాడు.

వాలిమై సినిమా కు సంబంధించినంత వరకు తమిళ అభిమానులు రికార్డు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. కాని అజిత్ కాస్త దూరంలో నిలిచి పోయాడు. వాలిమై సినిమా షూటింగ్‌ ను ముగించిన అజిత్‌ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తాడని సమాచారం అందుతోంది. తెలుగు లో సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో పవన్ కళ్యాణ్‌ నటించిన భీమ్లా నాయక్‌ కూడా ఒకటి ఉంది. వసూళ్ల పరంగా కూడా వాలిమై మరియు భీమ్లా నాయక్ లు పోటీ పడతాయేమో చూడాలి. ఒక వేళ అలా పోటీ పడితే ఖచ్చితంగా పవన్ సినిమాకు అత్యధిక వసూళ్లు నమోదు అవుతాయని మెగా అభిమానులు ధీమాతో ఉన్నారు. తెలుగు సినిమా హీరోల మార్కెట్‌ పెరిగి పోయింది. ఇతర భాషల్లో మరియు ఇతర దేశాల్లో కూడా పవన్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భీమ్లా నాయక్‌ గ్లిమ్స్ కు దక్కిన రికార్డుకు ఢోకా లేనట్లుగానే వసూళ్ల విషయంలో కూడా ఢోకా లేకుండా రికార్డు నమోదు అవుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.