దిల్ రాజు బ్యానర్ లో పవన్ మరో సినిమాకి సంతకం

Thu Apr 22 2021 10:00:01 GMT+0530 (IST)

Pawan Kalyan Another Movie With Dil Raju

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు కరోనా సోకడంతో చికిత్స పొందుతున్నారు. దీనినుంచి కోలుకుని ఆయన తిరిగి షూటింగుల కోసం వేచి చూస్తారు. నిర్మాతలకు ఇచ్చిన కమిట్ మెంట్లు పూర్తి చేస్తారు. సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రస్తుతానికి షూటింగులు వాయిదా పడ్డాయి. ఈ వేవ్ ఏమాత్రం తగ్గినా సెట్స్ కెళతారు. త్వరలో అయ్యప్పనమ్ కోషియం రీమేక్ .. క్రిష్ హరి హర వీర మల్లు చిత్రీకరణను పవన్ తిరిగి ప్రారంభించనున్నారు. హరీష్ శంకర్- సురేందర్ రెడ్డి చిత్రాలకు ఆయన సంతకం చేశారు. ఇవన్నీ వరసగా సెట్స్ కెళతాయి.ఆ తర్వాత కూడా పవన్ కి తీరిక లేని షెడ్యూల్ ఉంది. ఓవైపు రాజకీయాల్ని కొనసాగిస్తూనే ఆయన సినిమాలతో పార్టీకి నిధిని సమీకరిస్తున్నారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. తనని అడిగిన ప్రముఖ నిర్మాతలకు ఆయన కమిట్ మెంట్లు ఇస్తున్నారు.

తాజా సమాచారం మేరకు వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆనందంలో నిర్మాత దిల్ రాజుకు మరో సినిమా చేస్తానని వాగ్ధానం చేశారు. అంతేకాదు.. ఈ సినిమాకి అడ్వాన్స్ తీసుకుని సంతకం కూడా చేసేశారనేది తాజా అప్ డేట్. చాలా క్లారిటీగా దిల్ రాజు ఇప్పటికే పని ప్రారంభించారు. పవన్ కి సరైన దర్శకుడిని సెట్ చేసే పనిలో పడ్డారట. పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు  రెండో చిత్రం 2022 చివరిలో లేదా 2023 ప్రారంభంలో ప్రారంభమవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే అప్పటికి క్యూలో ఉన్న మూడు సినిమాల్ని పవన్ చకచకా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రభావం తో షూటింగులకు ఇబ్బంది ఉంది. ఈ వేవ్ మే చివరి నాటికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటివరకూ ప్రజలు ఇండ్లలోనే జాగ్రత్తగా ఉండాలి.