పవన్ హిట్ మూవీ సౌత్ తో ఆగట్లేదట..!

Sat Jun 25 2022 22:00:01 GMT+0530 (IST)

Pawan Hit Movie Remake in North

మలయాళం సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియుమ్ ను తెలుగు లో భీమ్లా నాయక్ గా రీమేక్ చేసిన విషయం తెల్సిందే. మల్టీ స్టారర్ కథతో రూపొందిన ఆ సినిమా ను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చి.. మొత్తం కమర్షియల్ గా మార్చేశారు. మలయాళం వర్షన్ ను పూర్తిగా కమర్షియల్ హంగులతో భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ హీరోగా తీసుకు వచ్చిన విషయం తెల్సిందే.అయ్యప్పనుమ్ కోషియుమ్ లో ఇద్దరు హీరోలకు సమాన పాత్ర ఉంటుంది. పాటలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. కాని ఎప్పుడైతే తెలుగు లో అనుకున్నారో పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా కథను మార్చడంతో పాటు పాట లను కూడా పెట్టాడు. ఇక రెండవ హీరోకు ప్రాముఖ్యత తగ్గించడంతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ప్రాముఖ్యత తగ్గించడం జరిగింది.

మొత్తం పవన్ కళ్యాణ్ కేంద్రంగా సినిమా కథ సాగింది. ఇప్పుడు తెలుగు వర్షన్ ను బేస్ చేసుకుని హిందీలో కూడా అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం ఈ రీమేక్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతుందట.

పవన్ కళ్యాణ్ మరియు రానా లు హోరా హోరీగా పోరాడిన సన్నివేశాలను హిందీ వర్షన్ లో ఏమాత్రం మార్చకుండా పెట్టబోతున్నారట. అంతే కాకుండా స్క్రిప్ట్ లో తెలుగు వర్షన్ కోసం ఏదైతే మార్పులు చేర్పులు చేశారో అదే హిందీ వర్షన్ కోసం కూడా అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

తెలుగు వర్షన్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా హిందీ వర్షన్ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం అన్నట్లుగా మేకర్స్ నమ్మకంతో ఉన్నారట. మొత్తానికి మలయాళ సూపర్ హిట్ సినిమా తెలుగు లో రీమేక్ అయ్యి కేవలం సౌత్ లోనే ఆగకుండా నార్త్ కు అంటే బాలీవుడ్ కు కూడా వెళ్తోంది.

ఇక్కడ రెండు భాషల్లో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ హిందీలో ఎలా ఉంటుంది అనేది చూడాలి.