Begin typing your search above and press return to search.

స్టూడెంట్‌ లీడర్‌ సినిమా కు పవన్‌ హెల్ప్‌

By:  Tupaki Desk   |   13 Nov 2019 1:32 AM GMT
స్టూడెంట్‌ లీడర్‌ సినిమా కు పవన్‌ హెల్ప్‌
X
ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్‌ లీడర్‌ జార్జ్‌ రెడ్డి బయోపిక్‌ ను 'జార్జ్‌ రెడ్డి' టైటిల్‌ తో తెరకెక్కించడం జరిగింది. ఈనెల 22న ప్రేక్షకుల ముందు కు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల కు పవన్‌ తనవంతు సాకారం అందించే అవకాశం కనిపిస్తుంది. ఈనెల 17న జరుగబోతున్న సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక లో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొనేందుకు ఒప్పుకున్నట్లు గా సమాచారం అందుతోంది. జార్జ్‌ రెడ్డి సినిమా పై సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.

మూడు పదుల వయసు కూడా నిండకుండా నే ఉద్యమ కెరటం గా నిలిచి బడా బాబుల కు దడ పుట్టించిన గొప్ప స్టూడెంట్‌ లీడర్‌ జార్జ్‌ రెడ్డి. ఈయన ఉస్మానియా యూనివర్శిటీ లో తన ప్రస్థానం మొదలు పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తం గా గుర్తింపు దక్కించుకున్నాడు. స్టూడెంట్స్‌ పై జరుగుతున్న అకృత్యాల కు మరియు తక్కువ జాతి వారి పై కొందరు చేస్తున్న దాడులకు వ్యతిరేకం గా జార్జ్‌ రెడ్డి పోరాడాడు. విప్లవ స్టూడెంట్‌ లీడర్‌ అయిన జార్జ్‌ రెడ్డి అంటే పవన్‌ కళ్యాణ్‌ కు కూడా అభిమానమట.

జార్జ్‌ రెడ్డి పై ఉన్న అభిమానం తోనే పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక కు హాజరు అయ్యేందుకు ఒప్పుకున్నట్లు గా సమాచారం అందుతోంది. జార్జ్‌ రెడ్డి సినిమా లో ప్రధాన పాత్రను సందీప్‌ మాధవ్‌ పోషించగా దళం ఫేం జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించాడు. సుధాకర్‌ యెక్కంటి సినిమాటోగ్రఫీ అందించారు. పీరియాడిక్‌ డ్రామా అవ్వడం తో ఈ సినిమా విభిన్నం గా వైవిధ్య భరితంగా ఉంటుందనే నమ్మకం తో సినీ వర్గాల వారు ఉన్నారు. ప్రేక్షకుల్లో కూడా ఇప్పుడిప్పుడే ఈ సినిమా పై ఆసక్తి పెరుగుతున్నట్లు గా అనిపిస్తుంది. జార్జ్‌ రెడ్డి గురించి తెలిసిన వారికి మరియు తెలియని వారికి కూడా ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆతృత కనిపిస్తోంది.