Begin typing your search above and press return to search.

బాహుబలి 2 కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తున్న పఠాన్

By:  Tupaki Desk   |   29 Jan 2023 11:00 AM GMT
బాహుబలి 2 కలెక్షన్స్ ని టార్గెట్ చేస్తున్న పఠాన్
X
షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్ద్ ఆనంద్ దర్శకత్వంలో హిందీలో తెరకెక్కిన చిత్రం పఠాన్. ఈ మూవీ మూడు రోజుల్లో ఏకంగా 313 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తూ కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. నాలుగో రోజు కూడా ఏ మాత్రం తగ్గకుండా అదిరిపోయే కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. నాలుగో రోజు కలెక్షన్స్ తో 400 కోట్లకి పఠాన్ సమీపించినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మాస్త్ర మీద ఉన్న హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసే దిశగా పఠాన్ దూసుకుపోతుంది.

సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బాలీవుడ్ చిత్ర ప్రముఖులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రాల జాబితాలో దంగల్ ఉంది. అయితే ఆ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే తక్కువ టైంలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో బాహుబలి 2 510 నెట్ కలెక్షన్స్ తో మొదటి స్థానంలో ఉంటే కేజీఎఫ్ చాప్టర్ 2 434 కోట్ల నెట్ కలెక్షన్ తో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు కూడా సౌత్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

ఈ నేపధ్యంలో ఇప్పటికే కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్స్ రికార్డుకి పఠాన్ చేరువ అయిపొయింది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ రికార్డుని పఠాన్ బ్రేక్ చేసేస్తుంది. అయితే పఠాన్ టార్గెట్ కేజీఎఫ్ చాప్టర్ 2 కాదని, బాహుబలి 2 రికార్డులు అని బాలీవుడ్ మీడియా చెబుతుంది. బాహుబలి 2 సాధించిన కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేయడం ద్వారా మళ్ళీ బాలీవుడ్ నెంబర్ వన్ అనే ఇమేజ్ ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో బాలీవుడ్ మీడియాతో పాటు, బాలీవుడ్ క్రిటిక్స్, సెలబ్రిటీలు అందరూ కూడా పఠాన్ సినిమాపై పైకి లేపుతూ ట్విట్టర్ లో కావాల్సినంత ప్రమోషన్ ఇస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్స్ పెడుతూ ప్రేక్షకులు ఎక్కువ మంది థియేటర్స్ వైపు వచ్చే విధంగా చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పఠాన్ కలెక్షన్స్ ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతున్నాయి. మరి బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు, అలాగే యశ్ రాజ్ ఫిలిమ్స్ పెట్టుకున్న బాహుబలి 2 కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేయాలనే టార్గెట్ ని అందుకుంటారా లేదా అనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.