Begin typing your search above and press return to search.

పఠాన్ యూఎస్ కలెక్షన్స్.. షారుక్ న్యూ రికార్డ్!

By:  Tupaki Desk   |   29 Jan 2023 2:01 PM GMT
పఠాన్ యూఎస్ కలెక్షన్స్.. షారుక్ న్యూ రికార్డ్!
X
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా పఠాన్. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్ గా, దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక జనవరి 25న రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సెన్సేషనల్ హిట్ బొమ్మగా పఠాన్ మూవీ నిలవడం విశేషం. షారుక్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత పఠాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. దీంతో సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

 అయితే ఒక వర్గం నుంచి పఠాన్ మూవీ పై నెగిటివ్ ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. పఠాన్ సినిమాని బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీ ని కూడా ఈ నెగిటివ్ టాక్ గత రెండేళ్ల నుంచి ఇబ్బంది పెడుతూ వస్తుంది. బాలీవుడ్ నుంచి వస్తున్న పెద్ద స్టార్ సినిమాలకు సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ నడుస్తుంది. అయితే ఈ నెగిటివ్ వైబ్ ని తట్టుకుంటూ పఠాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం ప్రశంసనీయం. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆధ్యాంతం ఆకట్టుకునే విధంగా ఉందని బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

 ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్ సమీపించింది. రికార్డు స్థాయి కలెక్షన్స్ ను ప్రతిరోజు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. కేవలం ఇండియాలోనే కాకుండా యూఎస్ లో కూడా పఠాన్ మూవీ సత్తా చాటుతూ ఉండడం విశేషం. మొదటి రోజే 1.48 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో రోజు 1.11 మిలియన్ డాలర్స్ ని అర్జించింది. ఇక మూడో రోజు కలెక్షన్స్ మరింత పెరిగి 1.85 మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. నాలుగో రోజు కూడా కలెక్షన్స్ మరింత అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్లాయి.

ఏకంగా 2.65 మిలియన్ యూఎస్ డాలర్స్ పఠాన్ మూవీ కలెక్ట్ చేసింది. కేవలం నాలుగు రోజుల్లోనే 7.07 మిలియన్ డాలర్స్ క్లబ్ లో పఠాన్ మూవీ చేరడం విశేషం. ఇండియన్ కరెన్సీ లో చూసుకుంటే ఇప్పటివరకు 57.7 కోట్లని ఈ సినిమా సంపాదించడం విశేషం. ఓవర్సీస్ లో మరింతగా కలెక్షన్స్ పెరుగుతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అలాగే లాంగ్ రన్ లో కచ్చితంగా 1000 కోట్లు గ్రాస్ ఈ మూవీ వసూలు చేసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అలాగే బాహుబలి 2 రికార్డులను కూడా బాలీవుడ్ లో ఈ మూవీ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు.