Begin typing your search above and press return to search.

పఠాన్​ @ రూ.300కోట్ల.. కేజీయఫ్​, బాహుబలి రికార్డ్స్ బ్రేక్​

By:  Tupaki Desk   |   28 Jan 2023 2:00 PM GMT
పఠాన్​ @ రూ.300కోట్ల.. కేజీయఫ్​, బాహుబలి రికార్డ్స్ బ్రేక్​
X
బాలీవుడ్ కింగ్​ షారుక్​ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రం బాలీవుడ్​కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువస్తుంది. విడుదల ముందు దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వివాదాలు ఎదుర్కొన్నా ఈ చిత్రం.. బాక్సాఫీస్​ను షేక్ చేస్తుంది. తమ కలెక్షన్లతో విమర్శలు చేసిన వారి నోరు మూయిస్తూ మైండ్​ బ్లాంక్​ చేస్తోంది. బాయ్​కాట్​ గ్యాంగ్​ను బెంబేలెత్తిస్తోంది. తొలి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్​ను అందుకున్న ఈ చిత్రం మూడు రోజులు పూర్తయ్యే సరికి అంతకుమించిన రేంజ్​ల్​ కలెక్షన్స్​ను అందుకుంటోంది.

జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. శుక్రవారం నాటికి వరల్డ్ వైడ్​గా దాదాపు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలిసింది. ఓవర్సీస్​లో రూ.100కోట్లకు పైగా గ్రాస్​ను సాధించింది. ఓవర్సీస్​లో షారుక్​ సినిమాలు రూ.100కోట్లకు పైగా వసూలు చేయడం ఇది పన్నెండో సారి.

దీని బట్టి బాద్‌షా స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. బాక్సాఫీస్​కే మైండ్​ బ్లాంక్​ అయింది. తద్వారా ఇండియాలో మూడు రోజుల్లో ఎక్కువ రాబట్టిన చిత్రంగానూ నిలిచింది. ఈ క్రమంలోనే 'కేజీఎఫ్ 2', 'బాహుబలి 2' రికార్డులు బ్రేక్ చేసింది. అలాగే, హిందీలోనూ టాప్ మూవీగా సంచలనం సృష్టించింది.

నాన్​ హాలీడేస్​ను ఈ రేంజ్​లో పఠాన్ కలెక్షన్స్ అందుకుంటే ఇక ఈ రెండు రోజులు హాలిడేస్​ కాబట్టి మరో రూ 200 కోట్లు అందుకోవడం పక్కా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఐదు రోజుల్లోనే రూ.500కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

కాగా స్పై యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సినిమాలో షారుక్ ఖాన్ ఇండియన్ రా ఏ జెంట్​గా కనిపించారు. దీపికా పడుకొణె.. షారుక్ సరసన నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించి అదరగొట్టారు. సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రూ. దాదాపు 250 కోట్ల బడ్జెట్​తో ఈ మూవీ రూపొందించారు.

భార‌త‌దేశంపై దాడికి ప్రణాళిక రచించిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ప్లాన్‌ను ప‌ఠాన్ ఎలా మట్టుబెట్టాడన్నదే ఈ సినిమా కథాంశం. క‌థ కన్నా యాక్ష‌న్ అంశాల‌కే అధికంగా ప్రాముఖ్య‌త‌నిస్తూ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.