ఎట్టకేలకు బాలీవుడ్ తల ఎత్తుకునేలా చేస్తున్న 'పఠాన్'

Tue Jan 24 2023 06:00:04 GMT+0530 (India Standard Time)

Pathaan to Break The Records in Bookings

2020 సంవత్సరానికి ముందు బాలీవుడ్ పరిస్థితి వేరు ఆ తర్వాత వేరు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇండియన్ సినిమా అంటే అంతర్జాతీయ స్థాయిలో హిందీ సినిమాలు అనే అభిప్రాయం ఉండేది. కానీ గత మూడు సంవత్సరాలుగా బాలీవుడ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గత ఏడాది వంద కోట్లు ఆపై వసూళ్లు సాధించిన సినిమాలు కేవలం నాలుగు అయిదు మాత్రమే ఉన్నాయి.సౌత్ లో పది సినిమాలకు పైగానే వందల కోట్ల వసూళ్లు నమోదు చేశాయి. కానీ హిందీలో మాత్రం సినిమాలు అక్కడ మినిమంగా వసూళ్లు రాబట్టడమే గొప్ప విషయం అయ్యింది. సౌత్ సినిమాలతో పోటీ పడటంలో బాలీవుడ్ సినిమాలు గత మూడు సంవత్సరాలుగా పూర్తిగా వెనుకబడి ఉన్నాయి.

ఎట్టకేలకు బాలీవుడ్ వారు తల ఎత్తుకునే విధంగా పఠాన్ సినిమా చేస్తోంది. ఈనెల 25వ తారీకున విడుదల కాబోతున్న పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కేజీఎఫ్ 2 రికార్డును బ్రేక్ చేయబోతున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

విడుదలకు మరో మూడు రోజులు సమయం ఉంది. ఇప్పటికే రెండు లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి. మరో రెండు రోజుల్లో ఖచ్చితంగా కేజీఎఫ్ 2 సినిమా యొక్క అత్యధిక 5.10 లక్షల టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జీరో సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని షారుఖ్ ఈ సినిమా తో రాబోతున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కోసం కేవలం హిందీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

సౌత్ లో అన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు. దీపిక పదుకునే బికినీ వివాదం సినిమాకు కలిసి వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరుగుతున్న నేపథ్యంలో సినిమాకు మినిమంగా పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా వందల కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.    నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.