Begin typing your search above and press return to search.

F3 పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ హ‌ల్ చ‌ల్

By:  Tupaki Desk   |   15 May 2022 6:35 AM GMT
F3 పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ హ‌ల్ చ‌ల్
X
విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ కామెడీ కేపర్ F3 చిత్రం 27 మే 2022 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. సునీల్ -సోనాల్ చౌహాన్ ఇందులో ముఖ్యమైన పాత్రలలో నటిస్తుండ‌గా పూజా హెగ్డే స్పెష‌ల్ నంబ‌ర్ యాడ్ చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఎఫ్ 3కి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మిస్తున్నారు. టీమ్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ రోజు ఉదయం F3 మేకర్స్ 2వ సింగిల్ వూ ఆ ఆహా ఆహా ప్రోమో ఇప్ప‌టికే వైరల్ అయిన సంగ‌తి తెలిసిందే. గత వారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. 20 మిలియన్లకు పైగా వీక్షణలతో ట్రైలర్ గత 6 రోజులుగా యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో ఉంది.

తాజాగా పూజా హెగ్డే స్పెష‌ల్ సాంగ్ `లైఫ్ అంటే ఇట్లా వుండాలా..` మే 17న విడుదల కానుంది. F3 నుండి లైఫ్ అంటే ఇట్లా వుండాలయా పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుందంటూ సంద‌డిని ప్రారంభించింది టీమ్. ఈ పాట ప్రోమో రేపు ఉదయం 10:08 గంటలకు విడుదల కానుంది. పార్టీవేర్ లో పూజా హెగ్డే- వెంకటేష్ - వరుణ్ తేజ్ లతో స్టెప్పులేయ‌నుంది. ఇందుకు సంబంధించిన బోల్డ్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రతి ఒక్కరూ నలుపు రంగు దుస్తులను ధరించి ఉన్నందున ఈ స్పెష‌ల్ నంబర్ కి స్పష్టంగా బ్లాక్ కాన్సెప్ట్ ఆపాదించ‌బ‌డింది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ అందించ‌గా.. ఇది సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌నుంది. కీలకమైన తరుణంలో వ‌చ్చే ఈ పాట విజువల్ ఫీస్ట్ గా అల‌రించ‌నుంది. ఇందులో స్టార్ కాస్ట్ అంతా తమ కాలు క‌ద‌ప‌నున్నార‌ని తెలిసింది. ఈ స్పెషల్ సాంగ్ గురించి మేకర్స్ ప్రకటించినప్పటి నుండి అభిమానుల్లో ఒక‌టే ఆసక్తి మొద‌లైంది. లిరికల్ వీడియోను విడుదల చేయడానికి ముందు పోస్టర్ ఆపై ప్రోమోలను విడుదల చేస్తూ టీమ్ క్యూరియాసిటీని పెంచుతోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 27 నుంచి థియేటర్లలో నవ్వుల హంగామా సృష్టించేందుకు ఎఫ్3 సిద్ధమైందని టీమ్ తాజాగా అధికారికంగా ప్ర‌క‌టించింది. ఎఫ్ 2 త‌ర‌హాలోనే ఫ‌న్ రొమాన్స్ వ‌ర్క‌వుటైతే మ‌రోసారి వెంకీ-వ‌రుణ్ జోడీ హిట్టు కొట్ట‌డం ఖాయం. ఈసారి మ‌రింత‌గా భామ‌ల‌తో గ్లామ‌ర్ ట్రీట్ ని ప్లాన్ చేసిన అనీల్ రావిపూడి ఎలాంటి థియేట‌ర్ల‌లో కిక్కిస్తాడో చూడాలి.