9 ఏళ్ల కఠోర ధీక్ష శిక్షణతో పారీ కల నెరవేరింది

Tue Jan 24 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Parineeti Chopra Turns Master Scuba Diver

సముద్ర గర్భంలో స్కూబా డైవింగ్ చాలా రిస్క్ తో కూడుకున్నది. తీరానికి సుదూరంలో అండర్ వాటర్ లో విపరీతమైన ఒత్తిడి నడుమ చేప పిల్లలా ఈదాలి. దీనికోసం ఒక ప్రత్యేకమైన డ్రెస్ సెటప్ కూడా ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్ అవసరం పడుతుంది. అయితే ఇలాంటి కఠినమైన శిక్షణ పొందేందుకు ఏళ్ల తరబడి శిక్షణ తీసుకుంది పారి అలియాస్ పరిణీతి చోప్రా. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ గా సుపరిచితురాలైన పరిణీతి ఇటీవల క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్న సినిమాలతో ఆకట్టుకుంది. కానీ కమర్షియల్ గా ఆశించిన విజయాల్ని అందుకోలేకపోతోంది.వృత్తి రీత్యా నటి అయినా పరిణీతి ఒక అథ్లెట్ కూడా. వాటర్ స్పోర్ట్స్ ని అమితంగా ఇష్టపడుతుంది. తాజాగా తన సోషల్ మీడియాలో పరిణీతి చోప్రా 'మాస్టర్ స్కూబా డైవర్' గా ఎలా మారిపోయిందో వివరించింది. 9 ఏళ్ల కఠోర శిక్షణ- రెస్క్యూ సెషన్లు- వందకు పైగా డైవ్ ల తర్వాత పరిణీతి 'మాస్టర్ స్కూబా డైవర్' టైటిల్ ను సాధించింది. ఈ ప్రత్యేక వార్తను తన అభిమానులకు షేర్ చేసేందుకు పరిణీతి చోప్రా  ఎంతో ఎగ్జయిట్ అయ్యింది.

తాజా ఇన్ స్టా పోస్ట్ లో ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా వెల్లడించింది. ''నేను ఇప్పుడు మాస్టర్ స్కూబా డైవర్ ని!!! ఇది పూర్తిగా అసాధ్యం అనిపించే ఒక ఉద్విగ్న భావన! నా 9 సంవత్సరాల కల ఎట్టకేలకు నెరవేరింది... ఇన్ని ఏళ్ల పాటు అదే ధ్యాస.. రెస్క్యూ శిక్షణ కృషి ఫలించాయి!'' అని తెలిపింది.  

నాకు నిజమైన గౌరవం దక్కింది! ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా శిక్షకుల నిరంతర మద్దతుకు @paditvకి కృతజ్ఞతలు మాత్రమే చెప్పలేను. మీరంతా ఇప్పుడు నా కుటుంబంలా ఉన్నారు. అలాగే మీకు తెలిసినవన్నీ నాకు నేర్పినందుకు అనీస్ - షమీన్ అడెన్ వాలాలకు ధన్యవాదాలు. మీరు నా సముద్ర డైవ్ కి తల్లిదండ్రులు. ఎప్పటికీ!'' అంటూ పారి ఎమోషనల్ గా నోట్ రాసారు. @scubanees @shameenadenwala అంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు.

పరిణీతి చోప్రా చివరిసారిగా సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహించిన 'ఉంచాయ్'లో కనిపించింది. సునీల్ గాంధీ మూలకథ ఆధారంగా అభిషేక్ దీక్షిత్ రచించిన కథ ఇది. రాజశ్రీ ప్రొడక్షన్స్- బౌండ్ లెస్ మీడియా- మహావీర్ జైన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో అమితాబ్ బచ్చన్- అనుపమ్ ఖేర్- బోమన్ ఇరానీ- డానీ డెంజొగొప్పా- పరిణీతి చోప్రా- నీనా గుప్తా- సారిక తదితరులు నటించారు. తదుపరి దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి 'చమ్ కిలా'... అక్షయ్ కుమార్ సరసన 'క్యాప్సూల్ గిల్'లో కనిపించనుంది.

ఎందుకో దురదృష్ట జాతకురాలు..!

ఇకపోతే పరిణీతి చోప్రా ఇటీవల కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను కోల్పోయింది. శ్రద్ధా కపూర్ నటించాల్సిన సైనా నెహ్వాల్ బయోపిక్ లో పరిణీతి నాయికగా ఎంపికైనా ఎందుకనో ఆ మూవీ అప్ డేట్ లేదు. రణబీర్ సరసన సందీప వంగా యానిమల్ లో పరిణీతి నటించాల్సి ఉన్నా ఛాన్స్ మిస్సయింది. ఇక దక్షిణాదిన సినిమాలు చేయాలని పారీ ఎంతో ఆశపడుతుంది. కానీ సరైన అవకాశం రాలేదు. ఆ మధ్య  ఓ తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని ప్రచారం సాగిందిగానీ చివరిగా ఛాన్స్ మిస్ అయినట్లు తెలుస్తోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.