బన్నీ ఏ కథకు ఓకే చెప్పలేదు!: పరశురామ్

Wed Aug 08 2018 22:17:10 GMT+0530 (IST)


'యువత'.. 'సోలో'.. 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలతో తన మంచి గుర్తింపే సాధించాడు దర్శకుడు పరశురామ్.  ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'గీత గోవిందం' సిన్నిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఈ సినిమా ఆగష్టు 15 న రిలీజ్ అవుతోంది.  ఈ సినిమా హిట్ అయితే పరశురామ్ కి బన్నీ అవకాశం ఇస్తాడని ఇప్పటికే ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. మరి పరశురామ్ ఏమంటున్నాడు?"నేను చెప్పే కథలంటే బన్నీకి చాలా ఇష్టం. తనకు బోర్ కొట్టినప్పుడల్లా నాతో కథలు చెప్పించుకుంటాడు. అలా మేమిద్దం ఎప్పటికప్పుడు స్టోరీ డిస్కషన్స్ చేస్తూనే ఉంటాం." అన్నాడు.  అంతే కాదు బన్నీతో సినిమా చేయాలనే ఆలోచన తనక్కూడా ఉందని - రెండు మూడు ఐడియాలు కూడా ఉన్నాయని కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ కావాలంటే అన్నీ కుదరాలి కదా అంటున్నాడు.  అంతే కాదు.. బన్నీ తో సినిమా చేయడం పెద్ద ఎఛీవ్మెంట్ అని చెప్పుకొచ్చాడు.   బన్నీకి ఎప్పుడూ తను ఏదో ఒక కథ చెబుతూనే ఉంటానని  తన కథలను బన్నీ బాగా ఎంజాయ్ చేస్తుంటాడని 'గీత గోవిందం' కథను కూడా మొదట బన్నీకే చెప్పానని తనకు స్టొరీ నచ్చిందని అన్నాడు.  కానీ బన్నీ ఒక్కసారి కూడా తన కథల్లో నటిస్తానని చెప్పలేదన్నాడు.

స్టార్ హీరోలన్నాక కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.  స్టైలిష్ స్టార్ మిగతావాళ్ళకంటే కాస్త ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా ఉన్నాడు. దాంతో కథలు వింటున్నాడు గానీ ఓకే చెయ్యడం లేదు.  విన్న ప్రతి కథకు ఒకే చెప్పి సెట్స్ మీదకు తీసుకెళ్లాలంటే అది ఎవ్వరికీ సాధ్యమయ్యే పని కాదు.   పరశురామ్ చెప్పినట్టుగా 'అన్నీ కుదరాలి కదా!'