టీజర్ టాక్ : దీనమ్మ జీవితం మానవత్వం చచ్చిపోయింది భయ్యా

Mon Jun 27 2022 11:21:32 GMT+0530 (IST)

Panja Vaisshnav Tej Ranga Ranga Vaibhavanga teaser looks Colourful

`ఉప్పెన` సినిమాతో తొలి ఎంట్రీ తోనే బ్లాక్ బస్టర్ మ్యూజికల్ లవ్ స్టోరీని అందించి వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన యంగ్ అంగ్ టాలెంట్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ `రంగ రంగ వైభవంగ`. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ ఎల్ పీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇద్దరు మెడీకోల రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా తమిళ దర్శకుడు గిరీషాయ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.`అర్జున్ రెడ్డి` తమిళ రీమేక్ `ఆదిత్య వర్మ` తో దర్శకుడిగా తమిళంలో పరిచయమైన గిరీషాయ తాజాగా `రంగ రంగ వైభవంగ` మూవీతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇక క్రిష్ తో చేసిన `కొండ పొలం` ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో వైష్ణవ్ తేజ్ తాజా మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడట.`రొమాంటిక్` మూవీ ఫేమ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కు రెడీ అయిపోతోంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ని ప్రారంభించేశారు. ఇప్పటికే లిరికల్ వీడియోలని విడుదల చేసి సినిమాపై హైప్ ని క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ టీజర్ ని సోమవారం విడుదల చేశారు.

ఒకరంటే ఒకరికి ప్రేమ వున్నా ఈగో కారణంగా దూరంగా వుంటూ గిల్లికజ్జాలు పడే ఇద్దు మెడికోల రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై యూత్ లో అంచనాల్ని క్రియేట్ చేశాయి. తాజాగా విడుదల చేసిన టీజర్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

`నన్నే చూస్తావ్..నా గురించే కలలు కంటావ్..నన్నే ప్రేమిస్తావ్...కానీ ..నీకు నాతో మాట్లాట్టానికి ఈగో.. దీనమ్మా జీవితం మానవత్వం చచ్చిపోయింది భయ్యా.. అంటూ హీరో హీరోయిన్ లు చెబుతున్న డైలాగ్ లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈగో ని ప్రధానంగా చూపిస్తూ దర్శకుడు రొమాంటిక్ ప్రేమకథని ఎంచుకున్న తీరు హీరో హీరోయిన్ పాత్రలని మలిచిన విధానం యూత్‌ని ఎట్రాక్ట్ చేసేలా వున్నాయి.  

వైష్ణవ్ తేజ్ కేతిక శర్మ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఇద్దరి మధ్య కుదిరిని కెమిస్ట్రీ ప్రతీ ఒక్కరిపనీ విశేషంగా ఆకట్టుకునేలా వున్నాయి. చక్కని కలర్ ఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని రూపొందించినట్టుగా కనిపిస్తోంది. వైష్ణవ్ తేజ్ నటన కేతిక గ్లామర్ ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరి ఫ్రెష్ కాంబినేషన్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడం ఖాయం అని చెబుతున్నారు. టీజర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.