పంజా డైరెక్టర్ పంజా వారబ్బాయి కాంబో మూవీ!

Tue Sep 14 2021 19:02:44 GMT+0530 (IST)

Panja Vaishnav Tej And Panja director Vishnu Vardhan Combo

పవన్ కళ్యాణ్ అభిమానులు పంజా సినిమాను ఎప్పటికి మర్చిపోలేరు. ఆ సినిమా దారుణమైన ప్లాప్ ను చవిచూసినా కూడా పవన్ ను దర్శకుడు విష్ణువర్ధన్ చూపించిన తీరు.. సినిమాలో పవన్ పాత్ర గురించి ఎప్పటికి గుర్తిండి పోతుంది. పవన్ ను అంతకు ముందు ఆ తర్వాత చూడని విధంగా పంజా సినిమాలో చూపించడం జరిగింది. ఆ సినిమా ప్లాప్ తర్వాత తెలుగు లో ఆయన కనిపించలేదు. ఇటీవలే బాలీవుడ్ లో షేర్షా సినిమాను తెరకెక్కించాడు. ఓఓటీ ద్వారా విడుదల అయిన ఆ దేశ భక్తి సినిమాకు సూపర్ హిట్ టాక్ దక్కింది. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో అంతా కూడా ఇప్పుడు ఆ డైరెక్టర్ గురించి చర్చిస్తున్నారు. సినిమాలో దర్శకుడు చూపించిన సన్నివేశాలు మనసుకు హత్తుకునే విధంగా ఉండటంతో పాటు నటీ నటుల భావోద్వేగాలను చక్కగా చూపించగలిగాడు అంటూ రివ్యూలు వచ్చాయి. అలాంటి దర్శకుడు చాలా కాలం తర్వాత తెలుగు లో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. అది కూడా మెగా హీరోతో అవ్వడం విశేషం.పంజా దర్శకుడు విష్ణు వర్థన్ దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది. ఉప్పెన సినిమాలో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ ఏ మెగా హీరోకు కాని ఏ ఇతర హీరోలకు కాని గ్రాండ్ ఎంట్రీని దక్కించుకున్నాడు. మొదటి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు దక్కించుకున్న వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం గిరీశయ్య దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా కు ముందే కొండపొలం సినిమా లో వైష్ణవ్ తేజ్ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా దసరా సందర్బంగా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించిన విషయం తెల్సిందే. కొండపొలం మరియు గిరీశయ్య ల సినిమాల తర్వాత పంజా దర్శకుడు విష్ణు వర్థన్ దర్శకత్వంలో పంజా వైష్ణవ్ మూవీ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

మెగా ఫ్యామిలీ నుండి చాలా సింపుల్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా అదృష్టం కొద్ది మొదటి సినిమానే కరోనా సమయంలో వంద కోట్లు సాధించడం వల్ల వైష్ణవ్ కు ఇప్పుడు క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. వీరిద్దరి కాంబోలో ఒక సినిమాను చేసేందుకు గాను తెలుగు నిర్మాత ఒకరు ప్రయత్నిస్తున్నారట. ఆయన ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ కు కథను వినిపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విష్ణువర్థన్ గత సినిమా దృష్ట్యా వైష్ణవ్ తేజ్ ఓకే చెప్పేశాడని.. త్వరలోనే కథ విషయంలో చర్చలు జరుగబోతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా గురించిన క్లారిటీ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.