Begin typing your search above and press return to search.

ఎక్సర్ సైజ్ ఫోజులతో రెచ్చగొడుతున్న పంజా భామ..

By:  Tupaki Desk   |   4 April 2020 12:30 AM GMT
ఎక్సర్ సైజ్ ఫోజులతో రెచ్చగొడుతున్న పంజా భామ..
X
సారా జేన్ డయాస్. తెలుగు తెరపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'పంజా' సినిమాలో మెరిసింది. తెలుగులో సారాకి తెలుగులో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా అయింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పటివరకు చేసింది తొమ్మిది సినిమాలే చేసినప్పటికీ అభిమానులను మాత్రం బాగానే సంపాదించుకుంది. జుబాన్, క్యా కూల్ హై హం, ఓ తేరి లాంటి సినిమాలతో మంచి గుర్తింపును తెచుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం సారా తలుపు తట్టలేదు. ఈ మధ్య కాలంలో సారా సినిమాలలో కనిపించడం లేదు. కానీ హాట్ హాట్ ఫోటో షూట్లతో మాత్రం అభిమానులను పలకరిస్తూనే ఉంది. అమ్మడు తాజాగా ఫోటోలతోనే మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది. ప్రస్తుతం క్వారంటైన్ నడుస్తుంది కనుక ఇంట్లోనే ఉంది పోస్టులతో మురిపిస్తోంది.

ఇక నిరంతరం ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. రీసెంట్ గా మూడు ఫొటోస్ పోస్ట్ చేసింది సారా. ఆ ఫొటోస్ లో అమ్మడు ఒక్కో ఫొటోలో ఒక్కో పోజిస్తూ కుర్రకారుని వేడెక్కిస్తుంది. కానీ ఎన్ని ఫోటోలు పెట్టి సోషల్ మీడియాను హీటెక్కించినా అమ్మడిని పట్టించుకునే దర్శక నిర్మాతలు ఎవరు కనిపించడం లేదు. ప్రస్తుతం సారా లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటుందట. పొట్టి పొట్టి ఎక్సర్ సైజ్ చేసే డ్రెస్ లతో ఫోజులిచ్చింది. అవి చూసి యవ్వనంలో ఉన్న కుర్రాళ్ళు ఎందుకు ఆగుతారు. అమ్మడిని చూసి ఇవే పోజులు సినిమాలలో చూపిస్తే ఇంకా సంతోషిస్తాం కదా.. అన్నట్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ ఫోటో షూట్లతో అయినా అమ్మడు సినిమాలలో కనిపించే అవకాశం ఉందేమో..!