Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ త‌న కెరీర్ తో గేమ్ ఆడుతున్నాడా?

By:  Tupaki Desk   |   2 Feb 2023 7:37 PM GMT
ప్ర‌భాస్ త‌న కెరీర్ తో గేమ్ ఆడుతున్నాడా?
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాల్లో న‌టిస్తున్నాడు. `బాహుబ‌లి` త‌రువాత ఆ స్థాయి విజ‌యాన్ని ద‌క్కించుకోలేక‌పోయిన ప్ర‌భాస్ వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్ ల‌ని మాత్రం బ్యాక్ టుఏ బ్యాక్ లైన్ లో పెట్టేస్తున్నాడు. గ‌త ఏడాది ప్రారంభంలో `రాధేశ్యామ్‌`తో భారీ డిజాస్ట‌ర్ ని ఎదుర్కొన్ని ప్ర‌భాస్ మ‌ళ్లీ ఆ త‌ప్పులు చేయ‌కూడ‌ద‌ని భావిస్తూనే వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ వెళుతున్నాడు. `రాధేశ్యామ్‌` కు ముందు చేసిన `సాహో కూడా ప్ర‌భాస్ కు ఆశించిన స్థాయి విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది.

ఇక తొలి మైథ‌లాజిక‌ల్ డ్రామా అంటూ చేసిన `ఆది పురుష్‌` టీజ‌ర్ తో ఎంత ర‌చ్చ చేసిందో.. ఏ స్థాయి వివాదానికి దారి తీసిందో తెలిసిందే. జ‌పాన్ కు చెందిన యానిమేష‌న్ మూవీ స్ఫూర్తితో ద‌ర్శ‌రుడు `ఆదిపురుష్‌`ని తెర‌కెక్కించ‌డ‌మే వివాదానికి ప్ర‌ధాన కార‌ణంగా నిలిచి విమ‌ర్శ‌ల పాల‌య్యేలా చేసింది. దీంతో ఈ మూవీ గ్రాఫిక్స్ కోసం మేక‌ర్స్ బ‌ల‌వంతంగా మ‌రో వంద కోట్లు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది. అది కూడా క‌రెక్ట్ గా కుద‌ర‌క‌పోతే మేక‌ర్స్‌, డైరెక్ట‌ర్ భారీ మేల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు.

గ్రాఫిక్స్ రీ వ‌ర్క్ కార‌ణంగా ఈ మూవీ రిలీజ్ ని జూన్ కు వాయిదా వేయ‌డం తెలిసిందే. `ఆది పురుష్` జూన్ 16న రాబోతోంది. ఇక ప్ర‌శాంత్ నీల్ తో చేస్తున్న `స‌లార్‌` ఇదే ఏడాది సెప్టెంబ‌ర్ 28న భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. `కేజీఎఫ్‌` యూనివ‌ర్స్ నేప‌థ్యంలో ఈ మూవీని రెండు భాగాలుగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నాడ‌నే వార్త‌లు జ‌క్క‌ర్లు కొడుతున్నాయి. కానీ మేక‌ర్స్ నుంచి మాత్రం ఇంత వ‌ర‌కు ఎలాంటి అప్ డేట్ లేదు.

ఇక ఈ రెండు సినిమాల త‌రువాత అంద‌రి దృష్టి `మ‌హాన‌టి` ఫేమ్ నాగ్ అశ్విన్ తెర‌కెక్కిస్తున్న `ప్రాజెక్ట్ కె`పై వుంది. 500 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని ఐవ‌జ‌యంతీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ వున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇంత టైట్ షెడ్యూల్ మ‌ధ్య ప్ర‌భాస్ హార‌ర్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో మారుతితో ఓ మూవీకి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం ఇది చిత్రీక‌రణ ద‌శ‌లో వుండ‌గానే సందీప్ వంగ `స్పిరిట్‌` తో పాటు బాలీవుడ్ డైరెక్ట‌ర్ సిద్ధార్ధ్ ఆనంద్ మూవీ వుంది. అంటే ప్ర‌భాస్ 2026 వ‌ర‌కు ఖాలీగా లేడ‌న్న‌మాట‌. మ‌రీ ఇంత హ‌రీ బ‌రీగా క్ష‌ణం తీరిక లేని టైట్ షెడ్యూల్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ప్ర‌భాస్ ఎందుకు లైన్ లో పెట్టాడు?.. కెరీర్ విష‌యంలో ఇంత కంగారుగా ఎందుకు వుంటున్నాడు?.. గ‌తంలో లేని హ‌రీ బ‌రీ ఇప్పుడే ఎందుకు ప‌డుతున్నాడు?.. వ‌రుస సినిమాల‌ని అంగీక‌రించి త‌న కెరీర్ తో తానే గేమ్ ఎందుకు ఆడుతున్నాడ‌నే కామెంట్ లు ప్ర‌స్తుతం వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.