Begin typing your search above and press return to search.

రౌడీ స‌ర‌స‌న పాన్ ఇండియా హీరోయిన్!

By:  Tupaki Desk   |   10 Dec 2019 9:43 AM GMT
రౌడీ స‌ర‌స‌న పాన్ ఇండియా హీరోయిన్!
X
రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. గ‌త కొంత‌కాలంగా దేవ‌ర‌కొండ మైండ్ పాద‌ర‌సంలా ప‌ని చేస్తోంది. టాలీవుడ్ లో ఏ ఇత‌ర హీరోతో పోల్చినా అత‌డి ప్లానింగ్స్ ఎక్స్ క్లూజివ్ యూనిక్ అనే చెప్పాలి. కెరీర్ ప్రారంభించిన చాలా త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్ లో స్టార్ రేంజుకు ఎదిగాడు. ఇప్పుడు త‌న స్థాయిని పాన్ ఇండియా రేంజుకు విస్త‌రించాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నాడు.

ఈ ప్ర‌య‌త్నాల్లో భాగంగానే శంషాబాద్ (హైద‌రాబాద్) టు ముంబై చ‌క్క‌ర్లు కొట్టేస్తున్నాడు. ఇంత‌కుముందు క‌ర‌ణ్ జోహార్ - మ‌నీష్ మ‌ల్హోత్రా రేంజు ప్ర‌ముఖుల్ని క‌లిసిన దేవ‌ర‌కొండ ఎట్ట‌కేల‌కు పాన్ ఇండియా ప్రాజెక్టుకు లైన్ క్లియ‌ర్ చేసుకున్నాడు. విజయ్ ఎంతో తెలివిగా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత క‌ర‌ణ్ జోహార్ ని బుట్ట‌లో వేయ‌డం.. అటుపై పూరి- ఛార్మి బృందాన్ని క‌ర‌ణ్ తో భాగ‌స్వాములుగా క‌లిపి పాన్ ఇండియా దిశ‌గా న‌డిపిస్తుండ‌డం చూస్తుంటే అంతా అవాక్క‌వుతున్నారు. ఇప్పుడు అత‌డు న‌టించ‌నున్న ఫైట‌ర్ లోక‌ల్ సినిమా కాదన్న‌ది అంద‌రికీ అర్థ‌మైంది.

అయితే ఇలాంటి క్రేజీ సినిమాలో క‌థానాయిక ఎవ‌రైతే బావుంటుంది? అన్నది ఆలోచిస్తున్నార‌ట‌. విజ‌య్ ఈ ఆప్ష‌న్ ని క‌ర‌ణ్ జోహార్ చేతిలోనే పెట్టాడ‌ట‌. ఇప్ప‌టికే నిర్మాత‌ల మ‌ధ్య భాగ‌స్వామ్యం కుదిర్చిన దేవ‌ర‌కొండ నాయిక విష‌యంలోనూ క‌ర‌ణ్ ఐడియానే ఫాలో అవుతున్నాడ‌ట‌. ఇక క‌ర‌ణ్ ఆర్డ‌ర్ వేయాలే కానీ.. అత‌డికి అత్యంత సన్నిహిత భామ‌లంతా దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించేందుకు సిద్ధ‌మే. న‌ట‌వార‌సురాళ్లు జాన్వీక‌పూర్- సారా అలీఖాన్ లాంటి భామలు అందుబాటులో ఉన్నారు. అలాగే ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా ప్ర‌కంప‌నాల‌కు తెర‌తీస్తున్న ఆలియాని ఒప్పించేస్తే ఫైట‌ర్ రేంజు ఆ లెవ‌ల్ ని ట‌చ్ చేస్తుంద‌ని స్కెచ్ వేశార‌ట. ఒక‌వేళ నిజంగానే ఆలియా .. మ‌న రౌడీ ప్ర‌పోజ‌ల్ కి ఓకే చెబితే ఆ ప్రాజెక్ట్ లెవ‌లే మారిపోతుంది అంటూ అభిమానుల్లో ఒక‌టే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే క‌ర‌ణ్ జోహార్ ఎవ‌రిని క‌మిట్ చేస్తారు? ఎవ‌రి కాల్షీట్లు అందుబాటులో ఉంటాయి? అన్న‌దే ఇప్పుడు ముందున్న టాస్క్. రిజ‌ల్ట్ వ‌చ్చే వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.