బాహుబలి మెచ్చిన కన్నడ సినిమా

Sat Oct 01 2022 11:24:07 GMT+0530 (India Standard Time)

Pan India star praises on Kannada cinema!

'కేజీఎఫ్' వంటి సంచలన సిరీస్ సినిమాల తరువాత కన్నడ ఇండస్ట్రీ యావత్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిర్ గా మారిన విషయం తెలిసిందే. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీస్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కన్నడ ఇండస్ట్రీ పేరు మారు మోగేలా చేశాయి. 'బాహుబలి' తో టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకుంటే 'కేజీఎఫ్' సిరీస్ సినిమాల తరువాత ప్రతీ ఒక్కరూ కన్నడ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.అంతా ఈ సినిమాలు కన్నడ ఇండస్ట్రీకి భారీ స్థాయిలో పాపులారిటీని క్రేజ్ ని తెచ్చిపెట్టాయి. అప్పటి నుంచి కన్నడలో ఏ సినిమా రిలీజ్ అవుతున్నా దేశం మొత్తం ఆసక్తిగా గమనించడం మొదలు పెట్టింది. కేజీఎష్ తరువాత కన్నడతో రక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన 'చార్లీ 777' కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ' హాట్ టాపిక్ అయ్యాయి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సొంతం చేసుకుని వసూళ్ల పరంగానూ సంచలనం సృష్టించాయి.

దీంతో కన్నడ ఇండస్ట్రీ అంటే ప్రత్యేకంగా చూడటం మొదలు పెట్టారు. వినూత్నమైన సినిమాలతో దేశ వ్యాప్తంగా వున్న ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న కన్నడ ఇండస్ట్రీ నుంచి రీసెంట్ గా విడుదలైన సినిమా 'కాంతారా'. గ్యాంగ్ స్టార్ డ్రామా 'గరుడ గమన వృషభ వాహన' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తానూ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. కన్నడలో తెరకెక్కిన ఈ మూవీని 'కేజీఎఫ్' ప్రొడ్యూసర్ హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించారు.

సెప్టెంబర్ 30 శుక్రవారం విడుదలైన ఈ మూవీ సంచలనం సృష్టిస్తోంది. ఫోక్లోర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఓ విజువల్‌ఫీస్ట్ అని వర్త్ వాచింగ్ ఫిల్మ్ అంటూ విమర్శకులు ప్రేక్షకులు ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీ కన్నడ వెర్షన్ విడుదలై ఇక్కడ కూడా మంచి ఆదరణనని సొంతం చేసుకుంటోంది. సర్వత్రా ప్రశంసలు కురుస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా స్టార్ బాహుబలి ప్రభాస్ ప్రశంసల వర్షం కురిపించాడు.

సినిమాని చాలా ఎంజాయ్ చేశానని మరీ మఖ్యంగా క్లైమాక్స్ సూపర్ అని ప్రశంసించారు. అంతే కాకుండా సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుసుతూ సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా ప్రభాస్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి 3.5 రేటింగ్స్ దక్కడం విశేషం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.