రిలీజ్ పై సంధిగ్ధంలో పడిన పాన్ ఇండియా మూవీ..!

Tue May 04 2021 07:00:01 GMT+0530 (IST)

Pan India movie in dilemma over release

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి సిరీస్ ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ చేసింది. అప్పటినుండి ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే లైన్ లో పెడుతున్నాడు. అయితే ప్రస్తుతం అందరూ ఎదురుచూస్తున్న మూవీ రాధేశ్యామ్. పీరియడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా నిజానికి గతేడాది విడుదల కావాల్సింది. కానీ అప్పుడు కరోనా కారణంగా వాయిదా పడుతూ మొత్తానికి ఈ ఏడాది జులై 30 రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ మెంట్ వచ్చేసింది. కానీ ఇంతలో మళ్లీ కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతుండటంతో సినిమా ఇప్పట్లో రిలీజ్ అయ్యేలా లేదని టాక్.ఇప్పటికే విడుదలకు సిద్ధమైన చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. పాన్ ఇండియా స్టార్స్ నుండి అప్ కమింగ్ హీరోల వరకు అందరూ సినిమా షూటింగ్స్ నిలిపేసి ఇళ్లకు చేరుకున్నారు. అయితే ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. రాధేశ్యామ్ షూట్ కొంచం బాలన్స్ ఉండటంతో అది కాస్తా ఫినిష్ చేద్దామని హైదరాబాద్ చేరుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి కరోనా వలన షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఇంతవరకు రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషనల్ వర్క్ ప్రారంభం కాలేదు. కానీ ఎలాగైనా సినిమాను ఇదే ఏడాది రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట ప్రభాస్.

ఒకవేళ వచ్చే ఏడాదికి వాయిదా వేస్తే మాత్రం తదుపరి సినిమాలు సలార్ ఆదిపురుష్ సినిమాలను పుష్ చేయాల్సి వస్తుందని టాక్. మరి ఓవైపు మేకర్స్ ఈ ఏడాది దసరా ఫెస్టివల్ సందర్బంగా రిలీజ్ చేయాలనీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కానీ రాధేశ్యామ్ సినిమా షూటింగ్ కాస్త మిగిలి ఉండటం కూడా ఇందుకు కారణం కాబోతుంది. ప్రస్తుతం రాధేశ్యామ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. చూడాలి మరి ఖచ్చితంగా రాధేశ్యామ్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో..!