Begin typing your search above and press return to search.

ర‌జ‌నీకాంత్ త‌ర్వాత ప్ర‌భాస్ కే ఆ రేంజ్!

By:  Tupaki Desk   |   11 Aug 2020 5:15 AM GMT
ర‌జ‌నీకాంత్ త‌ర్వాత ప్ర‌భాస్ కే ఆ రేంజ్!
X
బాలీవుడ్ లో ఖాన్ ల త్ర‌యానికే లేని రేంజు పారితోషికంలో త‌లైవా ర‌జ‌నీకాంత్ కి ఉంది. సౌత్ స్టార్ హీరోగా ఉత్త‌రాదినా హ‌వా సాగించే ఏకైక హీరోగా ర‌జ‌నీ పేరు ద‌శాబ్ధాలుగా మార్మోగుతూనే ఉంది. దేశ విదేశాల్లో ఆయ‌న‌కు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. జ‌పాన్ కొరియాలోనూ ర‌జ‌నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎదురేలేని మార్కెట్ ఉన్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు.

కానీ బాహుబ‌లి ఫ్రాంఛైజీ త‌ర్వాత ఆ సీన్ మొత్తం మారింది. ర‌జ‌నీ త‌ర్వాత దేశ‌విదేశాల్లో అంత‌టి ఫాలోయింగ్ పెంచుకోవ‌డంలో బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ స‌ఫ‌ల‌మ‌య్యారు. ఆ ఒక్క పాన్ ఇండియా సినిమా డార్లింగ్ గేమ్ మొత్తం మార్చేసింది. టాలీవుడ్ రేంజును అమాంతం పెంచేసింది. ఇప్ప‌టికిప్పుడు భారీ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాతో పాన్ ఇండియా నుంచి పాన్ వ‌ర‌ల్డ్ రేంజుకు షిఫ్ట‌య్యేందుకు ప్ర‌భాస్ గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్ర‌య‌త్నంలో భాగ‌మే నాగ్ అశ్విన్ తో ప్ర‌భాస్ 21 ప్రాజెక్ట్.

ఈ సినిమా పేరుతో ప్ర‌భాస్ ఖాతాలోకి ఏకంగా 100 కోట్లు జ‌మ అవుతుంద‌నేది అంచ‌నా. దాదాపు 70కోట్ల పారితోషికం చెల్లించేందుకు .. అలాగే డ‌బ్బింగ్ రైట్స్ లో స‌గం మొత్తం ప్ర‌భాస్ కే ఇచ్చేందుకు ఒప్పందం జ‌రిగింద‌నేది ఓ గుస‌గుస‌. నిజంగానే వంద కోట్లు అంటే ఆషామాషీనా? సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మాత్ర‌మే అంత పారితోషికం అందుకున్నార‌న్న క‌థ‌నాలు ఇంత‌కుముందు వ‌చ్చాయి. అమీర్ ఖాన్ .. స‌ల్మాన్ ఖాన్ లాంటి హీరోలు అంత పెద్ద మొత్తాలు అందుకున్నా.. హిందీ వైడ‌ర్ మార్కెట్ దృష్ట్యా అదేమంత గొప్ప కానే కాదు. ఒక సౌత్ స్టార్ పాన్ ఇండియా రేంజు సినిమాల్లో న‌టించ‌డం గొప్ప అనుకుంటే వీళ్లు అందుకునే పారితోషికాలు హిందీ అగ్ర హీరోల స్థాయిని మించిపోవ‌డ‌మే ఇప్పుడు స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారుతోంది.

ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న రాధేశ్యామ్ పూర్త‌యితే.. అటుపై నాగ్ అశ్విన్ - అశ్వ‌నిదత్ ప్రాజెక్ట్ (ప్ర‌భాస్ 21) పూర్త‌వుతుంది. ఆ సినిమాతో 100 కోట్ల ఆర్జ‌కుడిగా ప్ర‌భాస్ పేరు మార్మోగితే అటుపై బాలీవుడ్ సినిమా చేసే వీలుంటుంది. క‌ర‌ణ్ జోహార్ లేదా టీసిరీస్ వాళ్ల‌తో ప్ర‌భాస్ బాలీవుడ్ మూవీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తాజాగా ప్ర‌చార‌మ‌వుతోంది. మ‌రోవైపు య‌ష్ రాజ్ ఫిలింస్ లోనూ ఓ భారీ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్నాడ‌న్న టాక్ వినిపిస్తోంది. ఇవ‌న్నీ నిజ‌మైతే ప్ర‌భాస్ రేంజు పాన్ ఇండియా నుంచి పాన్ వ‌ర‌ల్డ్ స్థాయికి ఎదిగేసిన‌ట్టే. అప్పుడు 100 కోట్ల పారితోషిక‌మైనా చిన్న‌బోతుందేమో!