ఫోటో స్టోరీ: పక్కా కమర్షియల్ కోసం భువికి దిగి వచ్చిన దేవకన్య..!

Tue Nov 30 2021 12:18:48 GMT+0530 (IST)

Pakka Commercial Team birthday wishes to Raashi

'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ క్రమంలో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన రాశీ.. ప్రస్తుతం ''పక్కా కమర్షియల్'' అనే సినిమాలో నటిస్తోంది.సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ - రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ''పక్కా కమర్షియల్''. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నేడు రాశీఖన్నా పుట్టినరోజు సందర్భంగా ఓ స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. స్వీటెస్ట్ & సూపర్ టాలెంటెడ్ రాశీఖన్నా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని 'పక్కా కమర్షియల్' టీమ్ పేర్కొంది.

భువికి దిగి వచ్చిన దేవకన్యలా రాశీఖన్నా ను ప్రెజెంట్ చేశారు. ఇందులో గ్లామరస్ క్వీన్ రాశీ మరింత అందంగా కనిపిస్తోంది. ఆమె ఏంజెల్ వలె స్వచ్ఛమైనది.. ప్రేమ వలె తీయనైనదని అని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. గతంలో 'ప్రతిరోజూ పండగే' సినిమాలో ఏంజెల్ ఆర్నా వంటి ఎంటర్టైన్ చేసే పాత్రను రాశీకి ఇచ్చిన మారుతి.. 'పక్కా కమర్షియల్' లో ఆమె కోసం మరో మంచి క్యారక్టర్ రాశారని అర్థం అవుతోంది.

అంతేకాదు 'జిల్' తర్వాత గోపీచంద్ - రాశీ కలిసి నటిస్తోన్న రెండో సినిమా ఇది. గోపీచంద్ మార్క్ యాక్షన్ మరియు మారుతి తరహా కామెడీ కలబోసిన కమర్షియల్ కోర్టు డ్రామాగా 'పక్కా కమర్షియల్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరి ఈ సినిమా వీరికి పక్కా బ్లాక్ బస్టర్ అందిస్తుందో లేదో చూడాలి.

కాగా 'పక్కా కమర్షియల్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాస్ ఈ చిత్రానికి నిర్మాతగా.. SKN కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.