Begin typing your search above and press return to search.

'ప‌క్కా కమ‌ర్షియ‌ల్' టీమ్ అక్టోబ‌ర్ టార్గెట్

By:  Tupaki Desk   |   6 March 2021 9:59 AM GMT
ప‌క్కా కమ‌ర్షియ‌ల్ టీమ్ అక్టోబ‌ర్ టార్గెట్
X
మ్యాకో స్టార్ గోపిచంద్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` షూటింగ్ హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. 2021 అక్టోబ‌ర్ 1 న సినిమాస్(థియేట‌ర్ల‌)లో కి ..! అంటూ టీమ్ కాన్ఫిడెంట్ గా లాంచింగ్ డే రోజునే ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

యువి క్రియేష‌న్స్ - జీఏ2 సంస్థ‌లు సంయ‌క్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మా టీమ్ పై కామెంట్ల‌తో విషెస్ చెప్పాల్సిందిగా చిత్ర‌బృందం సోష‌ల్ మీడియాల్లో కోరింది.నేటి ఈ ప్రారంభోత్స‌వంలో బాస్ అల్లు అర‌వింద్.. గోపిచంద్.. మారుతి.. బ‌న్ని వాసు త‌దిత‌రులు పాల్గొన్నారు. రాశీఖ‌న్నా ఈ చిత్రంలో క‌థానాయికగా న‌టిస్తోంది. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` అన్న టైటిల్ కి త‌గ్గ‌ట్టే ప్ర‌తిదీ క‌మ‌ర్షియ‌ల్ గా ఆలోచించే యువ‌కుడి క‌థాంశ‌మిద‌ని తెలుస్తోంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్... మ‌హానుభావుడు త‌ర‌హాలోనే కాన్సెప్ట్ బేస్డ్ కామెడీ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఇద‌ని తెలుస్తోంది.