పక్కా కమర్షియల్ సెన్సార్ ఫినిష్.. రన్ టైమ్ ఫిక్స్!

Tue Jun 28 2022 15:00:01 GMT+0530 (IST)

Pakka Commercial Sensor Finish .. Runtime Fix!

టాలీవుడ్ మాచో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ ఈ సారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలి అని సిద్ధమవుతున్నాడు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా గోపిచంద్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరుస్తున్న విషయం తెలిసిందే. విభిన్న తరహాలో సినిమాలు చేస్తున్నాడు కానీ కమర్షియల్ గా సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకోవడం లేదు.ఇక ఇప్పుడు మారుతీ దర్శకత్వంలో చేసిన పక్కా కమర్షియల్ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేస్తున్నారు. ఇక పక్కా కమర్షియల్ సినిమా కు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్టు కూడా బయటకు వచ్చేసింది. సెన్సార్ యూనిట్ సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ను ఇవ్వడం జరిగింది.

 ఇక సినిమా నిడివి విషయానికి వస్తే 2 గంటల 32 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. పర్ఫెక్ట్ రన్ టైమ్ ఫిక్స్ చేసిన దర్శకుడు మారుతి అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా తెరపైకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమాలో దర్శకుడి మార్క్ కు తగ్గట్టుగా కామెడీతో పాటు గోపీచంద్ ఫాన్స్ కు నచ్చే విధంగా యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయట. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఓ వర్గం ప్రేక్షకులు అంచనాల స్థాయిని పెంచేసింది.

గోపీచంద్ అలాగే చిత్ర యూనిట్ సభ్యులు కూడా వరుసగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇక ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు కూడా భారీ స్థాయిలో స్పందన లభించింది. ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే.

ఆయన కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఫైనల్ గా ఈ సినిమాను జూన్ 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మరి పక్కా కమర్షియల్ సినిమాతో గోపీచంద్ ఎలాంటి రికార్డులను అందుకుంటాడో చూడాలి.