Begin typing your search above and press return to search.

కమర్షియల్ ఓపెనింగ్స్ సాధించిన పక్కా కమర్షియల్!

By:  Tupaki Desk   |   2 July 2022 5:58 AM GMT
కమర్షియల్ ఓపెనింగ్స్ సాధించిన పక్కా కమర్షియల్!
X
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమా తాజాగా ప్రనేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా పాజిటివ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. గోపీచంద్ క్యారెక్టరైజేషన్‌.. రాశి ఖన్నా పాత్ర ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ మూవీ అవ్వడం వల్ల కథకు తగ్గట్లుగా ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నాయి.

సినిమా కు మిశ్రమ స్పందన వచ్చినా కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు గత రెండు వారాలుగా చేసిన పబ్లిసిటీ కార్యక్రమాల వల్ల హైప్‌ వచ్చి భారీ గా ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. మొదటి రోజు ఈ సినిమాకు రూ.6.3 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ వీకెండ్ ముగిసే సరికి మరింతగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సినిమా లో మారుతి చూపించిన సీరియస్ అంశం కూడా ప్రేక్షకులను కాస్త కనెక్ట్‌ అయ్యేలాగా ఉంది. మొత్తానికి ప్లాప్‌ ల్లో ఉన్న గోపీచంద్‌ కు ఒక బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ పక్కా కమర్షియల్‌ రూపంలో దర్శకుడు మారుతి ఇచ్చినట్లు అయ్యింది. సినిమా లాంగ్‌ రన్‌ వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ఈ వీకెండ్‌ పూర్తి అయితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

పక్కా కమర్షియల్‌ సినిమా ను గత ఏడాదిలోనే అనుకున్నప్పటికి కరోనా ఇతర కారనాల వల్ల చాలా ఆలస్యం అయ్యింది. మారుతి కరోనా ముందు ప్రతి రోజు పండగే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్‌ హిట్‌ ను దక్కించుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే తరహా లో ఫ్యామిలీ హిట్‌ మూవీగా నిలుస్తుందా అనేది ఫుల్ రన్ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.