పాతికేళ్లుగా చెత్తలో ఉన్న రూ. 471 కోట్ల...

Mon Jan 20 2020 14:48:19 GMT+0530 (IST)

Painting found hidden in Italian gallery wall confirmed as long-lost Klimt

1917వ సంవత్సరంలో గుస్తవ్ క్లిమ్ట్ అనే ఆర్టిస్టు వేసిన ఒక అమ్మాయి ఆర్ట్ ను భారీ మొత్తానికి ఇటలీలోని రిచ్చీ ఆడీ గ్యాలరీ సొంతం చేసుకుంది. ఆ ఆర్ట్ కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పెద్ద మొత్తానికి ఆ ఆర్ట్ను రిచ్చీ ఆడీ గ్యాలరీ దక్కించుకోవడం జరిగింది. చాలా సంవత్సరాల వరకు రిచ్చీ ఆడీ గ్యాలరీలోనే ఆ ఆర్ట్ ఉంది. 1997లో అంటే దాదాపు పాతిక సంవత్సరాల క్రితం ఆ ఆర్ట్ కనిపించకుండా పోయింది. పోలీసు కేసు నమోదు అవ్వడంతో పాటు ప్రభుత్వపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఆర్ట్ ఎక్కడ ఉందో ఎవరు గుర్తించలేక పోయారు.ఆ ఆర్ట్ గురించి అంతా మర్చి పోతున్న సమయం లో ఇప్పుడు ఆ ఆర్ట్ దొరికింది. అది కూడా ఏదో ప్రాంతంలోనో లేదంటే మరేదో దేశంలోనో కాదు. అదే ఆర్ట్ గ్యాలరీ బయట ఒక గోడ సందులో కనిపించింది. ఇటీవల స్థానిక స్వీపర్ క్లీన్ చేస్తున్న సమయంలో గోడపై ఉన్న ఆకులను తొలగించేందుకు అతడు ఊడుస్తున్నాడట. ఆ సమయంలోనే ఏదో వస్తువు ఉన్నట్లుగా అతడు గుర్తించాడు. మెల్లగా దాన్ని బయటకు తీశాడు. అందులో ఒక ఆర్ట్ ఉండటం చూసి తన ఉన్నతాధికారులకు తెలియజేశాడు.

ఆ ఆర్ట్ ను చూసిన అధికారులు అవాక్కయ్యారు. పాతిక సంవత్సరాల క్రితం మిస్ అయిన ఆ ఆర్ట్ ఇప్పుడు కనిపించడం.. అది కూడా అదే ఆర్ట్ గ్యాలరీలో ఉండటంతో వారు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆ ఆర్ట్ 51 మిలియన్ ఫౌండ్ల రేటును అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 471 కోట్ల రూపాయల విలువను కలిగి ఉందట. అంతటి ఖరీదైన ఆ ఆర్ట్ ను ఎవరు అక్కడ ఉంచారు.. అందుకు సంబంధించిన కారణాలు ఏంటీ అనేది ప్రస్తుతం గ్యాలరీ అధికారులు విచారిస్తున్నారు. చాలా ఖరీదైన ఆర్ట్ కనుక ఇటలీలోని సెంట్రల్ బ్యాంక్ లాకర్ లో భద్రపర్చినట్లుగా తెలుస్తోంది. చాలా ఖరీదైన ముఖ్యమైన ఆర్ట్ దొరకడంతో స్థానిక మేయర్ ప్యాట్రిజియా హర్షం వ్యక్తం చేశాడు. ఆ ఆర్ట్ గురించి విచారణ జరిపిస్తామంటూ ఆయన ప్రకటించాడు.