Begin typing your search above and press return to search.

థియేటర్లలోనే 'పాగల్'.. రథన్ పాటలు ప్లస్ అవుతాయా..?

By:  Tupaki Desk   |   19 Jun 2021 10:30 AM GMT
థియేటర్లలోనే పాగల్.. రథన్ పాటలు ప్లస్ అవుతాయా..?
X
విభిన్న కథాంశాలను ఎంచుకొంటూ యూత్ లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్న 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''పాగల్''. నివేదా పేతురాజ్ - సిమ్రాన్ చౌదరి - మేఘ లేఖ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొత్త దర్శకుడు న‌రేష్ కొప్పల్లి ఈ చిత్రాన్ని ఒక యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి.

అలానే మ్యూజిక్ డైరెక్టర్ రథన్ స్వరపరిచిన 'సరదాగా కాసేపైనా' 'పాగల్' 'ఈ సింగిల్ చిన్నోడే' పాటలు ఫ్రెష్ గా ఉండటంతో పాటు.. యూత్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పాటలు సినిమా విజయానికి ఏ మాత్రం ప్లస్ అవుతాయో చూడాలి. ఇకపోతే మే 1న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల్లో వాయిదా పడింది. గత కొన్ని రోజులుగా థియేటర్స్ మూతబడి ఉండటంతో 'పాగల్' సినిమాని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్స్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్యారీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ - మురళీ శర్మ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. జూలై నుంచి థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 'పాగల్' విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.