స్టార్ ప్రొడ్యూసర్ కంబ్యాక్ ప్లాన్

Fri Dec 13 2019 10:06:35 GMT+0530 (IST)

PVP Trying to Comback In Telugu Film Industry

ఆయనో స్టార్ ప్రొడ్యూసర్...క్రేజీ స్లార్లు.. కాంబినేషన్లతో భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించారు. అయితే అదే స్థాయిలో వివాదాలు ఆయనను వెంటాడాయి. దాని కారణంగా పరిశ్రమలో ఆయన ప్రతికూలతల్ని ఎదుర్కొంటున్నారు. ఇదంతా ఎవరి గురించి అంటే.. ఆ స్టార్ ప్రొడ్యూసర్ మరెవరో కాదు పీవీపీ అలియాస్ ప్రసాద్ వి. పొట్లూరి.ఊపిరి సినిమా సమయంలో శృతిహాసన్ కారణంగా వివాదాల్లో చిక్కుకున్న పీవీపీ ఆ తరువాత `మహర్షి` సినిమా సమయంలో మహేష్ తో వివాదం వల్లా వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇవన్నీ అధిగమించినా నిర్మాతగా.. ఫైనాన్షియర్ గా కూడా ఆయనకు ఎదరు దెబ్బలే తగిలాయి. నిర్మాతగా కూడా భారీ నష్టాల్ని చూసిన పీవీపీ విజయవాడ ఎంపీగా పోటీ చేసి రాజకీయాల్లో మరో వైఫల్యం చవిచూశారు. పలు సందర్భాల్లో ఫైనాన్స్ విషయంలో నిర్మాత బండ్ల గణేష్ కు పీవీపీకి మధ్య పెద్ద రచ్చే జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.

ఇలా వరుస వివాదాల కారణంగా టాలీవుడ్ లో నిర్మాతగా పీవీపీ కెరీర్ డోలాయమానంలో పడింది. దాంతో అతనితో సినిమాలు చేయాలంటే స్టార్ హీరోలు ఆసక్తి చూపించడం లేదన్న గుసగుసలు ఫిలింనగర్ సర్కిల్స్ లో హీటెక్కించాయి. ఇన్ని అవాంతరాల్ని అధిగమించి మళ్లీ తన ప్రాభవాన్ని చాటుకోవాలని పీవీపీ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నారని తెలిసింది. ఈ సినిమాతో మరోసారి కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని పీవీపీ భావిస్తున్నారట. దీనిని ఛాలెంజింగ్ గానూ తీసుకున్నారని తెలుస్తోంది.