ప్రీ లుక్: కొండారెడ్డి బురుజు దగ్గర మహమ్మారి!

Fri May 29 2020 11:45:40 GMT+0530 (IST)

PV3 Portrait Motion Poster

'అ!'.. 'కల్కి' లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా మహమ్మారి పై ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు.  ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా #PV3 అనే పేరుతో పిలుచుకుంటున్నారు.  ప్రశాంత్ వర్మ జన్మదినం సందర్భంగా ఈ రోజు ఈ కొత్త సినిమా ప్రీ లుక్ మోషన్ పోస్టర్ ను ఫిలింమేకర్స్ విడుదల చేశారు.కొండారెడ్డి బురుజు అనగానే సినీ ప్రియులకు మహేష్ బాబు సినిమాలు 'ఒక్కడు'.. 'సరిలేరు నీకెవ్వరు' గుర్తొస్తాయి.  యాక్షన్ బ్లాక్స్ మనసులో మెదులుతాయి.  అయితే సేమ్ కొండారెడ్డి బురుజును ప్రశాంత వర్మ మహమ్మారి ఎంట్రీకి వాడడం కొత్తగా ఉంది.  'వాస్తవ సంఘటనల ఆధారంగా' అనే స్లైడ్ మొదట్లోనూ.. 'కరోనా అనేది ఆరంభం మాత్రమే' అనే స్లైడ్ చివర్లోనూ చూపించారు. సెంటర్లో ఉన్న ఓ విగ్రహం.. రెడ్ సిగ్నల్ చూపిస్తూ నెమ్మదిగా కొండారెడ్డి బురుజు రివీల్ చేస్తారు.  సిగ్నల్ పైన "స్టే హోమ్ స్టే సేఫ్' అనే స్లోగన్ ఉంటుంది.  కింద రోడ్డు మీద కొన్ని శవాలు పడి ఉంటాయి.. స్లోగా మహమ్మారి కబళించింది అన్నట్టుగా చూపిస్తారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ 40% పూర్తయిందని సమాచారం. మరి ఈ మహమ్మారిని ఎలా చూపిస్తాడో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడకతప్పదు.