Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ -రానా మ‌ల్టీస్టార‌ర్ ని వ‌ద‌ల‌ని లీకుల బెడ‌ద‌

By:  Tupaki Desk   |   5 March 2021 4:30 AM GMT
ప‌వ‌న్ -రానా మ‌ల్టీస్టార‌ర్ ని వ‌ద‌ల‌ని లీకుల బెడ‌ద‌
X
ఇటీవ‌లి కాలంలో సెట్స్ పై ఉన్న ప్ర‌తి పెద్ద సినిమాకి సంబంధించిన ఫోటో లీక్ లు ఫుటేజ్ లీక్ లు చూస్తున్నదే. జ‌క్క‌న్న అంత‌టి క‌ఠినాత్ముడు కూడా ఆర్.ఆర్.ఆర్ లీకుల్ని ఆప‌లేక‌పోయారంటే అర్థం చేసుకోవ‌చ్చు. మొన్న‌నే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బెంగాల్ పులితో పోరాటానికి సంబంధించిన క్యూరియ‌స్ ఫోటో లీకైపోవ‌డం క‌ల‌క‌లం రేపింది.

తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ -రానా మ‌ల్టీస్టార‌ర్ కి సంబంధించిన లీకులు బయటకు వచ్చాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి లీక్ లేద‌నుకుంటే ఇంత‌లోనే ఎలా బ‌య‌టికి వ‌చ్చిందో కానీ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై థ్రిల్లింగ్ సీక్వెన్సుకు సంబంధించిన ఓ ఫోటో లీకైపోయింది. ప‌వ‌న్ వెంటే పోలీసులు లాఠీలు ప‌ట్టుకుని క‌నిపిస్తుంటే దూరంగా ఎవ‌రో గోడ దూకుతున్నారు. ఆ ఫోటో చూడ‌గానే క్యూరియాసిటీ అభిమానుల్ని నిలువ‌నీయడం లేదు.

సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. మల‌యాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ విజయం సాధించిన అయ్య‌ప్ప‌నుమ్ కోషియం కి రీమేక్ ఇది. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి లీక్ లు రాకుండా అవసరమైన ముంద‌స్తు జాగ్రత్తలు తీసుకుంటోంది టీమ్. కానీ తాజా లీక్ తో ఆ జాగ్ర‌త్త స‌రిపోద‌ని అర్థ‌మ‌వుతోంది.

మాతృక లో పృథ్వీరాజ్ - బిజు మీన‌న్ లాంటి స్టార్లు పోషించిన పాత్ర‌ల్లోనే ప‌వ‌న్ - రానా న‌టిస్తున్నారు. ఇక ఈ మూవీ ఆద్యంతం ఆ ఇద్ద‌రి మధ్యా ఘ‌ర్ష‌ణ ర‌క్తి క‌ట్టిస్తుంది. తెలుగు వెర్ష‌న్ లో ప‌వన్ - రానా మ‌ధ్య సీన్స్ ని సాగ‌ర్ చంద్ర ర‌క్తి క‌ట్టించేలా తీర్చిదిద్ద‌నున్నార‌ని తెలిసింది. ఇక ఈ మూవీకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెరానువాద ప‌ర్య‌వేక్ష‌కుడిగా ఉన్నారు. మాట‌లు అందిస్తున్నారు కాబ‌ట్టి ఆ మేర‌కు పంచ్ లు అదిరిపోతాయ‌నే అభిమానులు అంచ‌నా వేస్తున్నారు.

శివరాత్రి లేదా ఉగాది కానుక‌గా చిత్ర‌బృందం నుంచి ట్రీట్ ఉంటుంద‌న్న లీకులు అందాయి. దీనిపై త్వరలో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. ఇక ఇలాంటి ఫోటో విజువ‌ల్ లీకులు లేకుండా సితార సంస్థ ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోనుందో వేచి చూడాలి.