Begin typing your search above and press return to search.

మన స్టార్ హీరోలు అలాంటి సినిమాలనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   26 Sep 2021 4:30 AM GMT
మన స్టార్ హీరోలు అలాంటి సినిమాలనే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారా..?
X
కరోనా పాండమిక్ సమయంలో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతబడి ఉండటంతో సినీ అభిమానులు.. వినోదం కోసం ఓటీటీ వేదికలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఓటీటీలు పోటీపడి కొత్త సినిమాలను కొనుగోలు చేసి స్ట్రీమింగ్ పెడుతున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నా, జనాలు సినిమాలు చూడటానికి వస్తారో లేదో అనే సందేహంతో చాలా మంది ఫిలిం మేకర్స్ ఓటీటీ బాట పడుతున్నారు. మొదట్లో చిన్న మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే నేరుగా ఓటీటీలో విడుదల అవ్వగా.. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా డిజిటల్ రిలీజ్ కు వెళ్తున్నాయి.

ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన మూడు సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'నారప్ప' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. అలానే నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని వినాయక చవితి సంధర్భంగా అదే వేదిక మీదకు తీసుకొచ్చారు. యూత్ స్టార్ నితిన్ లేటెస్ట్ మూవీ 'మాస్ట్రో' కూడా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా డిస్నీ హాట్ స్టార్ లోకి వచ్చింది.

అయితే ఈ మూడు క్రేజీ సినిమాలు కూడా పెద్ద సంఖ్యలో సినీ ప్రేమికులను ఆకట్టుకోలేకపోయాయనే కామెంట్స్ ఉన్నాయి. కకాకపోతే అభిమానులు మరియు ఓ వర్గం ఆడియన్స్ ఈ చిత్రాలను ఇష్టపడ్డారని తెలుస్తోంది. ఏదేమైనా ఈ సినిమాల రిజల్ట్ తర్వాత.. కంటెంట్ పేలవంగా ఉంటేనే మన స్టార్ హీరోలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తారనే భావన వీక్షకుల మనస్సులో పెరగడం ప్రారంభమైందని చెప్పవచ్చు.

తెలుగు ఫిలిం మేకర్స్ నుండి నాణ్యమైన కంటెంట్ ఆధారిత సినిమాలు వచ్చేంత వరకు ఓటీటీలకు అమ్మేవి ఫ్లాప్ చిత్రాలు మాత్రమే అని ప్రేక్షకులు భావించే అవకాశం ఉంది. ఇకపోతే 'లవ్ స్టోరీ' సినిమా రిజల్ట్ ని బట్టి ఓటీటీ డీల్ కుదుర్చుకోవాలని చాలా సినిమాలు వేచి చూస్తున్నాయి. అయితే ఈ మూవీ కలెక్షన్స్ ఆశాజనకంగా ఉండటంతో మరికొన్ని చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. తాజాగా 'వరుడు కావలెను' 'రొమాంటిక్' వంటి సినిమాల విడుదల తేదీలను మేకర్స్ ఖరారు చేసారు.