కింగ్ 60వ బర్త్ డే.. ఓన్లీ ఫర్ ఫ్యామిలీ!

Tue Aug 13 2019 14:45:20 GMT+0530 (IST)

Only Family Members For Nagarjuna 60th Birthday

కింగ్ నాగార్జున బర్త్ డే ఆగస్టు 29. ఆరోజు అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది? అంటే అందుకు ఇటీవలే కీలక సమాచారం అందించాం. కింగ్ నాగార్జునకు 60 సంవత్సరాలు పూర్తయి.. షష్టిపూర్తికి రెడీ అవుతున్న సందర్భంగా.. ఈ బర్త్ డే అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం. ఆయన జీవితంలో మెమరబుల్ డేగా నిలిచిపోయేలా వారసులు నాగచైతన్య- అఖిల్ బృందం ఇప్పటికే స్పెయిన్ ఇబిజ అనే నగరంలో ఘనమైన పార్టీకి ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే ఈ పార్టీకి అందరికీ ఆహ్వానం లేదు. కేవలం కుటుంబ సభ్యులు.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి మాత్రమే ఆహ్వానం ఉందని తెలుస్తోంది. అయితే ఇలా స్పెయిన్ లో ప్లాన్ చేయడానికి కారణం కింగ్ కి అది ఫేవరెట్ డెస్టినేషన్ అని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అంటే నాగార్జున- అమల.. నాగచైతన్య-సమంత.. అఖిల్.. సుమంత్.. సుశాంత్- నాగసుశీల ఫ్యామిలీ.. వెంకట్ ఫ్యామిలీ వీళ్లంతా స్పెయిన్ వెళ్లనున్నారు.

అయితే తమ కుటుంబం అంతా వారానికి ఒకసారి కలిసి భోజనం చేసేలా నాన్నగారి (ఏఎన్నార్) సమయంలో ఏర్పటు ఉండేదని దానివల్ల ఆరోజు తప్పనిసరిగా అంతా కలిసేవారమని నాగార్జున ఇదివరకూ తెలిపారు. ఇప్పుడు కూడా ఆ కుటుంబం అదే సాంప్రదాయాన్ని పాటిస్తోంది. వర్క్ షెడ్యూల్స్ టైమ్ మినహా మిగతా సందర్భాల్లో అప్పుడప్పుడు కలుసుకునేందుకు ఏదో ఒక అకేషన్ ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు అక్కినేని నాగచైతన్య - సమంత జంట పెళ్లికి కుటుంబ సమేతంగా సంబరాలు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గోవాలో రెండు రోజుల డెస్టినేషన్ వెడ్డింగ్ ని ఓ రేంజులో ప్లాన్ చేశారు. అక్కడ అక్కినేని కుటుంబం ఫుల్ గా చిలౌట్ చేసింది. మరోసారి నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆ రేంజులోనే సెలబ్రేషన్స్ ని ఎంజాయ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే ఆ ఛాన్స్ అన్నది మరోసారి కన్ఫామ్ అయ్యింది.