Begin typing your search above and press return to search.

మీటూ వేడి త‌గ్గిపోయాక వేధింపులపై ఓపెనైంది!

By:  Tupaki Desk   |   25 May 2020 3:45 AM GMT
మీటూ వేడి త‌గ్గిపోయాక వేధింపులపై ఓపెనైంది!
X
2018-19 సీజ‌న్ లో మీటూ ఉద్య‌మం గురించి తెలిసిందే. హాలీవుడ్ టు బాలీవుడ్ .. ఇటు సౌత్ ప‌రిశ్ర‌మ‌ల్ని అట్టుడికించింది. సుచీలీక్స్ .. శ్రీ‌లీక్స్ అంటూ సంచ‌ల‌నాల‌కు తెర‌లేచింది ఈ సీజ‌న్ లోనే. ఆ క్ర‌మంలోనే ప‌లువురు బ‌డా స్టార్ల పేర్లు మీటూ వేదిక‌గా బ‌య‌ట‌ప‌డ్డాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ మీటూ పేరుతో శిక్ష‌కు గురైన వారి పేర్లు మాత్రం ఎవ‌రికీ తెలీదు. అటు బాలీవుడ్ లో నానా ప‌టేక‌ర్ స‌హా ప‌లువురు న‌టులు.. ద‌ర్శ‌కులు కోర్టుల్లో పోరాటం సాగించి ఏదోలా బ‌య‌ట‌ప‌డ్డారు.

ఇటు టాలీవుడ్ లోనూ ప‌లువురు న‌టీమ‌ణులు లైంగిక వేధింపుల‌కు గుర‌య్యామ‌ని అప్ప‌ట్లో సంచ‌ల‌నాల‌కు తావిచ్చారు. తాజాగా వెట‌ర‌న్ న‌టుడు రాజేష్ కుమార్తె `కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి` ఫేం ఐశ్వ‌ర్య ఈ త‌ర‌హాలోనే వేధింపుల గురించి చెప్ప‌డం షాక్ నిస్తోంది. కెరీర్ ఆరంభం తన‌కు కూడా లైంగిక వేధింపులు ఎదుర‌య్యాయ‌ని ఐశ్వర్య తాజా చిట్ చాట్ లో వెల్ల‌డించింది. త‌నకు రంగు లేద‌ని వ‌ర్ణ వివ‌క్ష‌కు గుర‌య్యాన‌ని తెలిపి షాకిచ్చింది. ముంబై - హిందీ భామ‌లు రంగులో మేటి. అలాగే ఆర‌బోత‌కు సిద్ధంగా ఉంటారు. ఆ విష‌యంలో సౌత్ భామ‌లు వెన‌క‌బాటు గురించి చెప్పుకొచ్చింది ఐశ్వ‌ర్య‌. అందుకే తమ‌కు ఆ త‌ర‌హా వేధింపులు ఎదుర‌య్యేవ‌ని కూడా ఐశ్వ‌ర్యా రాజేష్ ఓ చిట్ చాట్ లో వెల్ల‌డించారు.

ఐశ్వ‌ర్య ప్ర‌ముఖ న‌టుడు రాజేష్ కుమార్తె. పైగా న‌టి శ్రీ‌ల‌క్ష్మికి క‌జిన్. అంత పెద్ద సినీనేప‌థ్యం ఉండీ వేధింపులు ఎదుర‌వ్వ‌డం షాక్ నిచ్చేదే. ఇంత‌కుముందు న‌టుడు శ‌ర‌త్ కుమార్ వార‌సురాలు వ‌ర‌ల‌క్ష్మి ఇదే తీరుగా బోల్డ్ గా త‌న‌కు ఎదురైన అనుభ‌వాన్ని వెల్లడించింది. అయితే ఈ ఇద్ద‌రు న‌టీమ‌ణులు చాలా బోల్డ్ గా ఇలాంటి వ్య‌వ‌హారాల్ని ఎదురించ‌గ‌లిగారు. ఇక కెరీర్ ప‌రంగా ఈ ఇద్ద‌రూ తొలుత త‌మిళంలో పాపుల‌రై అటుపై తెలుగులోనూ జ‌ర్నీ సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.