Begin typing your search above and press return to search.

'తిమ్మరుసు' చిత్రాన్ని ఏ వేదికపై విడుదల చేస్తారో..!

By:  Tupaki Desk   |   8 May 2021 6:30 AM GMT
తిమ్మరుసు చిత్రాన్ని ఏ వేదికపై విడుదల చేస్తారో..!
X
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''తిమ్మరుసు''. 'అసైన్‌మెంట్‌ వాలి' అనేది దీనికి ట్యాగ్ లైన్. 'కిర్రాక్ పార్టీ' ఫేమ్ శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లాయర్‌ పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్‌ లుక్‌ - టీజర్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని మే 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభన కారణంగా సినిమాల విడుదలలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో 'తిమ్మరుసు' కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

'తిమ్మరుసు' సినిమాతో హిట్ కొడతామని హీరో దర్శకనిర్మాతలు చాలా హోప్ తో ఉన్నారు. అయితే ఇప్పుడు కోవిడ్ కారణంగా థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. అందులోను థర్డ్ వేవ్ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో థియేటర్లు ఓపెన్ చేసే సాహసం ఇప్పట్లో చేయకపోవచ్చు. ఈ నేపథ్యంలో 'తిమ్మ‌రుసు' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తే బాగుంటుంద‌ని సినీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే స‌త్య‌దేవ్ న‌టించిన '47 డేస్' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' 'గువ్వ గోరింక' సినిమాలు ఓటీటీలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్నాయి. దీంతో సత్య దేవ్ ఓటీటీ స్టార్ హీరోగా మారిపోయాడు. అంతేకాక ప్రమోషన్ కంటెంట్ తో ఈ సినిమా మీద ఇండ‌స్ట్రీలో పాజిటివ్ టాక్ బాగా న‌డుస్తోంది. ఇలాంటివన్నీ లెక్కలోకి తీసుకొని ఫ్యాన్సీ ఆఫర్ వస్తే ఓటీటీకి ఇచ్చేయడం మంచిదని అంతా సలహాలు ఇస్తున్నారు.

కాగా, 'తిమ్మరుసు' చిత్రాన్ని ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ మరియు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై మహేష్ కోనేరు - సృజన్‌ ఎరబోలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకల సంగీతం సమకూర్చగా.. అప్పు ప్రభాకర్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించారు. ఇందులో బ్రహ్మాజీ - అజయ్‌ - ప్రవీణ్‌ - ఆదర్శ్‌ బాలకృష్ణ - ఝాన్సీ - వైవా హర్ష - సంధ్యా - జనక్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.