‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఒలివియా పాత్ర ఇదేనా?

Sun Jun 07 2020 11:25:12 GMT+0530 (IST)

Olivia morris Role in Rajamouli RRR

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత జక్కన్న ఈ సినిమాను చేస్తుండటమే అందుకు కారణం. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చరణ్‌లు నటిస్తుండగా వారికి జోడీగా ఒలివియా మోరిస్ మరియు ఆలియా భట్ లు నటిస్తున్నారు.ఆలియా భట్ అల్లూరి సీతారామరాజు పాత్రకు మరదలి పాత్రలో కనిపించబోతుంది. ఇక ఒలివియా ఇంగ్లాండ్‌కు చెందిన యువతి పాత్రలో కనిపించబోతుందట. ఎన్టీఆర్‌తో ప్రేమలో పడి.. ఇండియన్స్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న విధానంకు చెలించి పోయి పుట్టిన దేశంను కన్న తల్లిదండ్రులను వదిలేసి ఇండియాకే పరిమితం అయ్యి కొమురం భీమ్ తో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటుందట.

ఈ క్రమంలో కొమురం భీంతో ప్రేమలో పడుతుందని ఆయన్ను పెళ్లి చేసుకుంటుందని సినీ వర్గాల్లో ఈమె పాత్ర గురించిన చర్చ జరుగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఒలివియా మోరిస్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని జెన్నీఫర్ గా ఆమె సినిమాలో కనిపించబోతుందని యూనిట్ సభ్యులు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. ఈ మహమ్మారి వైరస్ కారణంగా సినిమా మరోసారి వాయిదా పడటం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.